Mallika Sagar: ఆక్షనీర్ గా ఆకర్షిస్తున్న మల్లికా సాగర్..నెట్లో తెగ సెర్చ్ చేస్తున్న జనాలు

మల్లికా సాగర్...ఇప్పుడు ఈమె పేరు వైరల్ అవుతోంది. డబ్ల్యైపీఎల్ 2024కు ఆక్షనీర్ గా వ్యవహరిస్తున్న ఈమె గురించి నెట్ లో జనాలు తెగ వెతికేస్తున్నారు. నెక్ట్స్ ఐపీఎల్ కి కూడా మల్లికానే ఆక్షనీర్ గా ఉండే అవకాశం ఉండడంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

New Update
Mallika Sagar: ఆక్షనీర్ గా ఆకర్షిస్తున్న మల్లికా సాగర్..నెట్లో తెగ సెర్చ్ చేస్తున్న జనాలు

Mallika Sagar: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) వేలం ఈరోజు జరుగుతోంది. ముంబైలో ఇది జరుగుతోంది. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీలు వేలంలో పాల్గొన్నాయి. ఐదు ఫ్రాంచైజీలతో 30 స్లాట్లు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 165 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో 104 మంది ఇండియా ప్లేయర్లు కాగా.. 61 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. మొదటి సీజన్ సక్సెస్ కావడంతో రెండో సీజన్ వేలంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గుజరాత్ జెయింట్స్ జట్టు అత్యధికంగా 10 మంది ప్లేయర్లను తీసుకునే అవకాశం ఉంది.

publive-image

Also Read:రెండో గ్యారెంటీ అమలుకు శ్రీకారం..ఈరోజే రాజీవ్ ఆరోగ్యశ్రీ మొదలు

డబ్ల్యూపీఎల్ రెండో ఎడిషన్ వేలం ముంబైలోని (Mumbai) జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతోంది. అయితే వీటన్నికంటే ఇప్పుడు అందరి దృష్టి ఆక్షనీర్‌గా వ్యవహరిస్తున్న మల్లికా సాగర్‌పైనే ఉంది. తొలి సీజన్‌లోనూ ఆమే ఆక్షనీర్‌గా ఉన్నారు. కానీ ఈ సీజన్ లోనే అందరూ ఈమె గురించి తెలుసుకోవడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. దీంతో ఆమె ఎవరు..? అని నెట్టింట సర్చ్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. మల్లికా సాగర్ (Mallika Sagar) ముంబైలో ఆర్ట్‌ కలెక్షన్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆర్ట్‌ ఇండియా సంస్థలో పని చేస్తున్నారు. అయితే ఈమె వ్యక్తిగత విషయాలు మాత్రం తెలియడం లేదు. ఎక్కడా వీటి గురించి మల్లికా ప్రస్తావించలేదు కూడా.

publive-image

2000లో ఆర్ట్‌ కలెక్షన్‌ను ప్రారంభించిన మల్లికా సాగర్‌.. 2001లో క్రిస్టీస్‌లో భారతీయ సంతతికి చెందిన మొదటి మహిళా వేలం కర్తగా నిలిచారు. 2021లో ప్రొ కబడ్డీ లీగ్‌కు కూడా ఆక్షనీర్‌గా వ్యవహరించారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్‌ వేలం సందర్భంగా ఆమె అందరినీ దృష్టిని ఆకర్షించారు. ఈ క్రమంలో డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా జరగనున్న ఐపీఎల్ 2024 పురుషుల వేలాన్ని కూడా మల్లికా సాగర్‌తో నిర్వహించాలని నిర్వహకులు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. 2018 నుంచి వేలం నిర్వహిస్తున్న హ్యూ ఎడ్మీడ్స్‌ ప్లేస్‌ను ఆమె భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఐపీఎల్ వేలాన్ని హ్యూ ఎడ్మీడ్స్‌తోపాటు రిచర్డ్‌ మ్యాడ్లీ, చారు శర్మ ఇప్పటివరకు నిర్వహించారు.

publive-image

Advertisment
Advertisment
తాజా కథనాలు