తాను చనిపోతూ కూడా 48 మందిని బతికించిన డ్రైవర్‌!

సనా ప్రధాన్‌ అనే వ్యక్తి ఒడిశా లో బస్సు డ్రైవర్‌ గా పని చేస్తున్నాడు. రోజులాగానే విధి నిర్వహణలో భాగంగా ఆదివారం కూడా 48 మంది ప్రయాణికులను బస్సులో ఎక్కించుకుని భువనేశ్వర్‌ కి బయల్దేరాడు. బస్సు కొంచెం దూరం ప్రయాణించగానే..డ్రైవర్‌ కి ఒక్కసారిగా గుండె పోటు వచ్చింది. వెంటనే బస్సు వేగాన్ని క్రమక్రమంగా తగ్గిస్తూ వచ్చాడు. ఒక్కసారిగా బస్సు ఆపకుండా దగ్గరలో ఉన్న ఓ గోడను ఢీకొట్టాడు. దీంతో బస్సు ఆగిపోయింది.

తాను చనిపోతూ కూడా 48 మందిని బతికించిన డ్రైవర్‌!
New Update

విధి నిర్వహణలో తాను ఎంతో బాధ్యతగా ఉండేవాడు. ఆ బాధ్యతతోనే తన బస్సులో ఎక్కిన  ప్రతి ప్రయాణికుడిని సురక్షిత ప్రాంతాలకు చేర్చేవాడు. ఒకవేళ అనుకొని పరిస్థితుల్లో ఏదైనా ప్రమాదం ముంచుకు వచ్చినా.. తన ప్రాణాన్ని పణంగా పెట్టి మరీ ప్రయాణికులను కాపాడేవాడు. తన బస్సులో ప్రయాణిస్తున్న 48 మంది ప్రాణాలకు తన ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడాడు ఈ బస్సు డ్రైవర్‌.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సనా ప్రధాన్‌ అనే వ్యక్తి ఒడిశా లో బస్సు డ్రైవర్‌ గా పని చేస్తున్నాడు. రోజులాగానే విధి నిర్వహణలో భాగంగా ఆదివారం కూడా 48 మంది ప్రయాణికులను బస్సులో ఎక్కించుకుని భువనేశ్వర్‌ కి బయల్దేరాడు. బస్సు కొంచెం దూరం ప్రయాణించగానే..డ్రైవర్‌ కి ఒక్కసారిగా గుండె పోటు వచ్చింది.

Also read: పసిడి ప్రియులకు భారీ షాక్..ధరలకు రెక్కలోచ్చాయి!

కానీ సనా మాత్రం తనకి ఏమౌతుందో అని ఆలోచించకుండా తన వెనుక ఉన్న 48 మంది గురించి ఆలోచించాడు. వెంటనే బస్సు వేగాన్ని క్రమక్రమంగా తగ్గిస్తూ వచ్చాడు. ఒక్కసారిగా బస్సు ఆపకుండా దగ్గరలో ఉన్న ఓ గోడను ఢీకొట్టాడు. దీంతో బస్సు ఆగిపోయింది. ఆ సమయంలోనే డ్రైవర్‌ కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

సనా అక్కడికక్కడే తన ప్రాణాలు విడిచాడు. దీంతో బస్సులోని వారు ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించి ఆర్టీసీ అధికారులకు సమాచారం అందించారు. ఈ విషయం గురించి బస్సులోని వారు మాట్లాడుతూ.. డ్రైవర్‌ కి బస్సు నడుపుతుండగా ఒక్కసారిగా గుండె పోటు వచ్చిందని తెలిపారు.

ఆయనకు కనీసం స్టీరింగ్‌ ని పట్టుకోవడం, దానిని కంట్రోల్‌ చేయడం కూడా చాలా కష్టం గా మారింది. కానీ తనతో పాటు ఉన్న ప్రయాణికులను కాపాడాలని ఆయన చివరి వరకు ప్రయత్నించాడు. మా ప్రాణాలను కాపాడి తన ప్రాణాలు విడిచిపెట్టాడు అంటూ వారు పేర్కొన్నారు. కాగా ఈ ఘటన కంధమాల్ జిల్లా లోని పబురియా గ్రామ సమీపంలో రాత్రి జరిగిందని ప్రయాణికులు పేర్కొన్నారు.

#odisha #bus #bus-driver #eart-attack
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe