Bad Cholesterol: చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా అనేక వ్యాధులు వస్తాయి. అయితే ఊబకాయుల్లో ఎక్కువగా చెడు కొలెస్ట్రాల్ ఉంటాయని అనుకుంటూ ఉంటారు. సన్నగా ఉన్నవారికి కూడా చెడు కొలెస్ట్రాల్ ఉంటాయని వైద్యులు అంటున్నారు. కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చని చెబుతున్నారు. చెడు కొలెస్ట్రాల్ సిరల్లో ఉండిపోయే మైనం లాంటిది. ఇది రక్త ప్రసరణను కూడా చాలా ప్రభావితం చేస్తుంది. కొలెస్ట్రాల్ రెండు రకాలు ఉంటాయి. అవి మంచి కొలెస్ట్రాల్ HDL, చెడు కొలెస్ట్రాల్ LDL.
చెడు కొలెస్ట్రాల్ వల్ల నష్టాలు:
చెడు కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల రక్తం సరిగ్గా చేరాల్సిన చోటికి చేరుకోలేకపోతుంది. దీని వల్ల గుండెపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు అంటున్నారు.
చెడు కొలెస్ట్రాల్ ఎలా వస్తాయి..?
సరైన ఆహారం, వ్యాయామం చేయనివారిలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. చెడు కొలెస్ట్రాల్ పెరగడంతో హైబీపీ సమస్య కూడా పెరుగుతుంది. ధమనులలో కూడా ఫలకం పేరుకుపోవడం ప్రారంభమవుతుందని అంటున్నారు. అలాగే శరీరంలో ఆక్సిజన్ లేకపోవడం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు.
చెడు కొలెస్ట్రాల్ ఎంత స్థాయిలో ఉండాలి..?
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. శరీరంలో కొలెస్ట్రాల్ 150 కంటే ఎక్కువ పెరగడం ప్రారంభిస్తే అది శరీరానికి చాలా ప్రమాదకరమని అంటున్నారు. మంచి ఆహారం తీసుకోవడంతో పాటు నిత్యం వ్యాయామం చేస్తే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: సీజన్ మారింది..జుట్టు సంరక్షణలో ఈ మార్పులు చేసుకోండి
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.