EPFO: ఈపీఎఫ్ఓల్లో పెరగనున్న టేక్ హోమ్ శాలరీ

2013 సెప్టెంబర్ 1 తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారికి ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. గవర్నమెంట్ ఉద్యోగుల గ్రూప్ ఇన్యూరెన్స్ స్కీమ్‌లో డిడక్షన్లను నిలిపివేయనుంది. దీంతో ఉద్యోగుల టేక్ హోమ్ శాలరీ పెరగనుంది.

New Update
EPFO: ఈపీఎఫ్ఓల్లో పెరగనున్న టేక్ హోమ్ శాలరీ

Godd news For Government Jobe Holders: ఎంప్లాయస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉద్యోగుల జీతాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. 2013 సెప్టెంబర్ 1 తరువాత గవర్నమెంటు ఉద్యోగాల్లో జాయిన్ అయిన వారు టేక్ హోమ్ ఎక్కువ వచ్చేలా సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకారం వీరికి గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ఇచ్చే డిడక్షన్లు ఇక మీదట వర్తించవు. దాని కారణంగా ప్రభుత్వ ఉద్యోగుల చేతికి వచ్చే ఆదాయం మరింత ఎక్కువ కానుంది. అయితే బాగా గుర్తుంచుకోవల్సిన విషయం ఏంటంటే ఇది కేవలం 2013 పెస్టెంబర్ తర్వాత జాయిన్ అయినవారికి మాత్రమే వర్తిస్తుంది. అంతకు ముందు ఉద్యోగుల ఉన్న వారికి పాత నిబంధనలే అనుసరిస్తారు. ఈ మేరకు ఈపీఎఫ్ఓ 2024 జూన్ 21న దీనికి సంబంధించిన ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఈ స్కీమ్ వచ్చే నెల నుంచే అమలు అవుతుంది.

అంతేకాదు దీంతో పాటటూ మంచి వార్త కూడా చెప్పింది ఈపీఎఫ్ఓ. 2013 సెప్టెంబర్ 1 తరువాత ఉద్యోగంలో చేరినవారికి ఇప్పటి వరకు డిడక్షన్ అయిన మొత్తం కూడా రీఫండ్ అవుతుంది. జీఐఎస్ పరిధి నుంచి వీరిని శాశ్వతంగా తొలగించనున్నారు. జీఐఎస్ కింద తగ్గింపులు నిలిపివేయడంతో ఉద్యోగుల టేక్ హోమ్ శాలరీలు కూడా పెరగనున్నాయి.

Also Read:Telangana: రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ కీలక ప్రకటన..

Advertisment
Advertisment
తాజా కథనాలు