Mechanic Rocky Glimpse: మాస్ కా దాస్ విశ్వక్ ‘మెకానిక్‌ రాకీ’ గ్లింప్స్ ...!

మాస్ కా దాస్ విశ్వక్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘మెకానిక్‌ రాకీ’. తాజాగా మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘మెకానిక్‌ రాకీ’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో విశ్వక్ మెకానిక్ పాత్రలో అలరించబోతున్నట్లు కనిపిస్తోంది.

New Update
Mechanic Rocky Glimpse: మాస్ కా దాస్ విశ్వక్ ‘మెకానిక్‌ రాకీ’ గ్లింప్స్ ...!

Mechanic Rocky Glimpse : టాలీవుడ్ (Tollywood) యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి బ్యాక్ బ్యాక్ హిట్స్ తర్వాత ‘మెకానిక్‌ రాకీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విశ్వక్ మెకానిక్ పాత్రలో అలరించబోయే ఈ చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ రవితేజ ముళ్ళపూడి (Ravi Teja Mullapudi)దర్శకత్వం వహిస్తున్నారు. మీనాక్షి చౌదరీ, శ్రద్ధ శ్రీనాథ్ ఫిమేల్ లీడ్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన పోస్టర్ మంచి రెస్పాన్స్ క్రియేట్ చేయగా.. తాజాగా మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

మెకానిక్ రాకీ గ్లింప్స్

తాజాగా మేకర్స్ 'మెకానిక్ రాకీ' గ్లింప్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్ క‌ల‌ర్ ఫుల్‌గా సాగింది. విశ్వక్ డైలాగ్స్.. శ్రద్ధ శ్రీనాథ్, మీనాక్షి విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. ''ఛోటే-ఛోటే బచ్చోంకే పూరే జవాబ్ దేతీ హూం'' అంటూ విశ్వక్ చెప్పే డైలాగ్స్ హైలెట్ గా అనిపించాయి. కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్‌ 31న విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఎస్‌ఆర్‌టి ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌ పై రామ్ తాళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Also Read: Krishna Vamsi: కృష వంశీ బర్త్ డే స్పెషల్.. మొదటి చిత్రంతోనే నంది అవార్డు..! - Rtvlive.com

Advertisment
తాజా కథనాలు