Viduthalai: క్రిస్మస్ బరిలో విజయ్ సేతుపతి 'విడుతలై' పార్ట్ 2...!

విజయ్ సేతుపతి- వెట్రిమారన్ కాంబోలో రాబోతున్న తమిళ్ ఫిల్మ్ 'విడుతలై2'. తెలుగులో 'విడుదల' అనే పేరుతో రిలీజ్ కానుంది. తాజాగా మేకర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 26న తమిళ్ తో పాటు తెలుగులో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు తెలిపారు.

Viduthalai: క్రిస్మస్ బరిలో విజయ్ సేతుపతి 'విడుతలై' పార్ట్ 2...!
New Update

Viduthalai: కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ముందుకెళ్తున్నారు. ఇటీవలే ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ 'మహారాజ' సినిమాతో సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నారు. తండ్రి, కూతుళ్ళ సెటిమెంట్ తో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అంతేకాదు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ సేతుపతి-కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కాంబోలో రూపొందుతున్న మోస్ట్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ 'విడుతలై' పార్ట్ 2. తమిళ్ లో సూరి, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ హిట్ 'విడుతలై' పార్ట్ 1 సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

'విడుతలై' పార్ట్ 2 రిలీజ్ సెట్

ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 26న తమిళ్, తెలుగు, ఇతర భాషల్లోనూ విడుదల కానున్నట్లు ప్రకటించారు. తెలుగులో విడుదల అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి లెజండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఇది ఇలా ఉంటే క్రిస్మస్ కానుకగా రామ్ చరణ్- శంకర్ గేమ్ చేంజర్ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. దీంతో ఈ సినిమాల మధ్య క్లాష్ గట్టిగానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

Also Read: Coolie: రజినీ కాంత్ 'కూలీ' లో కింగ్.. నాగార్జున లుక్ అదిరింది..! - Rtvlive.com

#viduthalai #vijay-sethupathi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe