Mr. Bachchan : రవితేజ - భాగ్య శ్రీ డ్యూయెట్.. ట్యూన్ అదిరిపోయిందిగా..!

హీరో రవితేజ- హరీష్ శంకర్ కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ 'మిస్టర్ బచ్చన్'. తాజాగా మూవీ సెకండ్ సింగల్ 'సితార్' సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఫుల్ సాంగ్ జులై 10న రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది.

New Update
Mr. Bachchan : రవితేజ - భాగ్య శ్రీ డ్యూయెట్.. ట్యూన్ అదిరిపోయిందిగా..!

Ravi Teja Latest Film Mr. Bachchan Second Single 'Sitar' Song Promo : టాలీవుడ్ (Tollywood) మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మిస్టర్ బచ్చన్'. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోగా.. తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

'సితార్' సాంగ్ ప్రోమో

'మిస్టర్ బచ్చన్' సెకండ్ సింగల్ 'సితార్' సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఫుల్ సాంగ్ జులై 10న ఉదయం 11.07 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. రవితేజ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కలిసి స్టెప్పులేసిన ఈ రొమాంటిక్ డ్యూయెట్ అందమైన లొకేషన్స్ లో షూట్ చేశారు. ఈ పాట ట్యూన్‌ కూడా ఇంప్రెసివ్‌గా సాగుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఫుల్ సాంగ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.

ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా.. జగపతిబాబు, శుభలేఖ సుధాకర్ తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. షాక్, మిరపకాయ్ వంటి సూపర్ హిట్స్ తర్వాత రవితేజ- హరీష్ కాంబోలో రాబోతున్న 'మిస్టర్ బచ్చన్' (Mister Bachchan) పై ఆసక్తిగా ఉన్నారు ఫ్యాన్స్.

Also Read: Prabhas Spirit: ప్రభాస్ కోసం హాలీవుడ్ విలన్.. ‘స్పిరిట్’ నెక్స్ట్ లెవెల్ అప్డేట్..!

Advertisment
తాజా కథనాలు