RGV: ఇది వారికి వినోదం మాత్రమే..! నాగచైతన్య- శోభిత పెళ్లి పై ఆర్జీవీ కామెంట్స్

సోషల్ మీడియాలో శోభితతో డేటింగ్ కారణంగానే సమంత- నాగచైతన్య విడిపోయారనే చర్చ పై ఆర్జీవీ స్పందించారు."ఈ పుకార్లన్నీ వినోదం కోసం సృష్టించుకునేవి మాత్రమే. ఆ సమస్య వారి ముగ్గురికి సంబంధించినది. వారు ఏమనుకుంటున్నారనేది వాళ్లిష్టం. దానిపై మనం కామెంట్‌ చేయలేమని అన్నారు."

New Update
RGV: ఇది వారికి వినోదం మాత్రమే..! నాగచైతన్య- శోభిత పెళ్లి పై ఆర్జీవీ కామెంట్స్

RGV: టాలీవుడ్ నటి సమంతతో విడిపోయిన మూడేళ్లకు నాగచైతన్య తన కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. ఇటీవలే నటి శోభిత దూళిపాలతో నిశ్చితార్థం చేసుకొని.. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఇక శోభితతో ఎంగేజ్‌మెంట్ తర్వాత చై-సామ్ విడాకుల గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. శోభితతో డేటింగ్ కారణంగానే చైతు- సామ్ విడిపోయారని ఫ్యాన్స్ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు. శోభిత పై ట్రోల్స్ కూడా చేస్తున్నారు. ఈ రచ్చ పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన స్టైల్ లో స్పందించారు.

నాగచైతన్య- శోభిత పెళ్లి పై ఆర్జీవీ కామెంట్స్

తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆర్జీవీ శోభిత కారణంగానే సమంత- నాగచైతన్య విడిపోయారనే వార్తల పై మాట్లాడారు. "ఈ పుకార్లన్నీ కేవలం వాళ్ళ ఎంటర్ టైన్మెంట్ కోసం సృష్టించుకునేవి మాత్రమే. ఆ సమస్య వారి ముగ్గురికి సంబంధించినది. దానిపై బయట వాళ్ళు మాట్లాడడం వినోదం మాత్రమే. ఇది ఒక సోషల్ మీడియా ఎంటర్టైన్మెంట్. చివరిగా ఎఫెక్ట్ అయ్యేది ఆ ముగ్గురు మాత్రమే. ఎవరి వ్యక్తిగతం వారిది వాటిపై మనం కామెంట్స్ చేయలేము అని అన్నారు ఆర్జీవీ".

పెళ్లి, చావు ఒకటే

అలాగే నాగార్జున.. నాగచైతన్య పెళ్ళికి పిలిస్తే వెళ్తారా అని అడగగా.. నేను వెళ్ళను అని సమాధానమిచ్చారు. అయినా నాగార్జునకు తెలుసు నేను రానని అందుకే పిలవరు అని  చెప్పారు. ఆ తర్వాత పెళ్ళికి సంబంధించి మరికొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆర్జీవీ. చావు, పెళ్లిని నేను ఒకేలా చూస్తాను. చావుతో స్వేచ్ఛ జీవితం నుంచి మరో లోకానికి వెళ్లినట్లు... పెళ్లితో స్వేచ్ఛను వదిలేసి మరో ప్రపంచానికి వెళ్తున్నట్టే. నా దృష్టిలో పెళ్లి, చావు ఒకటే అని షాకింగ్ కామెంట్స్ చేశారు.

Also Read: Actress Hema: సీఎం సార్ ప్లీజ్ నన్ను కాపాడండి.. సెటిల్‌మెంట్ అంటూ వాళ్లు నా పరువు తీస్తున్నారు! - Rtvlive.com

Advertisment
Advertisment
తాజా కథనాలు