Mr.Bachchan Review: టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ - హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ మిస్టర్ బచ్చన్. భారీ అంచనాలతో రూపొందిన ఈ చిత్రం నేడు థియేటర్స్ లో విడుదలైంది. రావణాసురా, టైగర్ నాగేశ్వర్ రావు వంటి వరుస ఫ్లాప్స్ తర్వాత వస్తున్న ఈ చిత్రం పై ఫ్యాన్స్ భారీ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. దానికి తోడు మేకర్స్ కూడా సినిమా పై అంచనాలు పెంచారు. ఇప్పటికే యూఎస్, హైదరాబాద్‌లో షోలు పడిపోయాయి.
ఇక సినిమా చూసిన వాళ్లంతా ట్విట్టర్ లో రివ్యూలను ఇస్తున్నారు. ట్విట్టర్ టాక్ చూస్తుంటే రవితేజ ఫ్యాన్స్ కు మరో సారి నిరాశే ఎదురైనట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు మిక్స్డ్ రివ్యూలు వస్తున్నాయి. కొందరు సినిమా ఫుల్ డిజప్పాయింటెడ్ చేసిందని అని కామెంట్స్ చేయగా.. మరికొందరు సినిమా ఎక్స్‌ట్రార్డినరీగా.. రవితేజ ఖాతాలో మరో హిట్టు ఖాయం అని పోస్టులు పెడుతున్నారు. 'మిస్టర్ బచ్చన్' హిందీలో అజయ్ దేవగన్ నటించిన 'రైడ్' రీమేక్. రీమేక్ ను సేమ్ అలాగే తీసిన బాగుండేదని. కమర్షియల్ హంగులకు పోయి.. అనవసరమైన సీన్లు చాలా యాడ్ చేశారని. 'రైడ్' మూవీ సీన్స్ ఫైట్ సీన్స్ ఎక్కువున్నాయని. 'రైడ్' మూవీ అభిమానిగా సినిమాకు వెళ్లాలనుకుంటే స్కిప్ చేయడం బెటర్ అని కామెంట్స్ చేస్తున్నారు. రవితేజ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్, భాగ్యశ్రీ బోర్స్ స్క్రీన్ ప్రజెన్స్, కమెడియన్ సత్యతో కనిపించే కామెడీ సన్నివేశాలు తప్పితే సినిమాలో ఏమి లేదని అంటున్నారు.
Also Read: Double Ismart: డబుల్ ఇస్మార్ట్ మేకింగ్ వీడియో.. అదిరిపోయింది..! - Rtvlive.com