Janhvi Kapoor : తల్లి సినిమాలపై జాన్వీ సంచలనం.. ఏమన్నారంటే?
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఆమె తల్లి శ్రీదేవి నటించిన 'మిస్టర్ ఇండియా' రీమేక్ పై తన అభిప్రాయాన్ని పంచుకుంది. మిస్టర్ ఇండియా లాంటి క్లాసిక్‌లు ఎప్పటికీ అలాగే ఉండాలి. వాటిని టచ్ చేయకూడదు అని తెలిపింది.
Janhvi Kapoor Comments On Her Mother : అతిలోక సుందరి శ్రీదేవి (Sri Devi) మన మధ్య లేకపోయిన.. ఆమె వారసురాలిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జాన్వీ (Janhvi Kapoor) బాలీవుడ్ లో మంచి స్టార్ గా ఎదిగింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ ఆమె తల్లి శ్రీదేవి నటించిన 'మిస్టర్ ఇండియా' (Mister India) రీమేక్ కు సంబంధించి తన అభిప్రాయాన్ని పంచుకుంది.
మిస్టర్ ఇండియా రీమేక్ పై జాన్వీ రియాక్షన్
జాన్వీ మిస్టర్ ఇండియా 2 గురించి మాట్లాడుతూ.. కొన్ని క్లాసిక్‌లు ఎప్పటికీ అలాగే ఉండాలి. వాటిని టచ్ చేయకూడదు అని తెలిపింది. అలాగే జాన్వీ సినిమాల ఎంపికల పై తన తండ్రి డెసిషన్ పై తనకున్న నమ్మకాన్ని కూడా ప్రస్తావించింది. అలాగే యాక్టింగ్ విషయంలో తన తండ్రి తనను ఎప్పుడూ ఒత్తిడి చేయలేదని చెప్పింది.
జాన్వీ సినిమాలు
ప్రస్తుతం జాన్వీ వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే మిస్టర్ అండ్ మిసెస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జాన్వీ.. ఆ తర్వాత 'ఉలజ్' సినిమాతో సిద్ధంగా ఉంది. గుల్షన్ దేవయ్య- జాన్వీ జంటగా నటించిన ఈ చిత్రాన్ని సుధాన్షు సరియా తెరకెక్కించారు. స్పై థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీలో జాన్వీ IFS అధికారిణిగా కనిపించబోతుంది. ఈ చిత్రం ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర, మెగా హీరో రామ్ చరణ్ సరసన 'RC 16' లో నటిస్తోంది.

Also Read: Odela 2: బోనం ఎత్తిన తమన్నా.. ఓదెల 2 కొత్త పోస్టర్..! - Rtvlive.com