Maharaja: ఓటీటీలో విజయ సేతుపతి యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..?

సౌత్ స్టార్ విజయ్ సేతుపతి లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'మహారాజా'. జూన్ 14న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. జూలై 12 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

New Update
Maharaja: ఓటీటీలో విజయ సేతుపతి యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..?

Maharaja Movie OTT Release: సౌత్ స్టార్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) నటించిన లేటెస్ట్ మూవీ 'మహారాజ'. జూన్ 14న విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద బంపర్ వసూళ్లను రాబట్టింది. 25 రోజుల థియేట్రికల్ రన్ విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

మహారాజ ఓటీటీ స్ట్రీమింగ్

తాజాగా మహారాజ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ రివీల్ చేశారు. జులై 12 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు పోస్టర్ రిలీజ్ చేసింది నెట్ ఫ్లిక్స్. ఈ సినిమా తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలిపింది. థియేటర్స్ లో మిస్ అయిన వారు ఇప్పుడు హాయిగా ఇంట్లో కూర్చొని ఈ సినిమాను ఎంజాయ్ చేయవచ్చు.

సినిమా కథ

ఒక సెలూన్ షాప్ నడుపుతున్న మహారాజ (విజయ్ సేతుపతి) చుట్టూ తిరుగుతుంది ఈ కథ. మహారాజ తన లక్ష్మి పోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. ఇంతకీ ఆ లక్ష్మి ఎవరు..? విజయసేతుపతికి ఆ లక్ష్మికి సంబంధమేంటి..? ఆ లక్ష్మి ఎక్కడికి వెళ్ళింది..? లక్ష్మి కోసం విజయ్ సేతుపతి ఏం చేశాడు..? అనేది స్టోరీలో చూపించారు. నితిలన్ స్వామినాథన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, నట్టి నటరాజ్, అభిరామి, అరుల్ దాస్, మునిష్కాంత్, బాయ్స్ మణికందన్, సింగం పులి, భారతీరాజా, వినోద్ సాగర్, పిఎల్ తేనప్పన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Also Read: Kalki 2898 AD: 1000 కోట్ల దిశగా.. బాక్స్ ఆఫీస్ వద్ద కల్కి వసూళ్ళ సునామీ..! - Rtvlive.com

Advertisment
తాజా కథనాలు