/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-20T135149.603.jpg)
Saripodhaa Sanivaaram: వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సరిపోదా శనివారం’. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రంలో కన్నడ ముద్దు గుమ్మ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించగా.. నటుడు ఎస్.జే సూర్య పోలీస్ ఆఫీసర్ గా కీలక పాత్ర పోషించారు.
ఎస్.జే సూర్య బర్త్ డే స్పెషల్
అయితే నేడు ఎస్.జే సూర్య పుట్టినరోజు సందర్భంగా మూవీ నుంచి ఆయన స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియోలో నాని- ఎస్.జే సూర్య మధ్య సంభాషణలు, సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ప్రజల్ని హింసించే నరకాసురుడుని వదించడానికి శ్రీ కృష్ణుడు సత్యభామతో కలిసి వెళతాడు అనే డైలాగ్స్ తో ఈ స్పెషల్ వీడియోను షేర్ చేస్తూ బర్త్ డే విషెష్ తెలియజేశారు. ఈ సినిమాలో ఎస్.జే సూర్య విలన్ గా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు.
సరితూగే సమరమే
సంహారం తథ్యమే
War is ON #NotATeaserhttps://t.co/4E912anyuy@iam_SJSuryah 🔥#SaripodhaaSanivaarampic.twitter.com/gdAF1TAZO3— Nani (@NameisNani) July 20, 2024
Also Read: Rana Naidu: ఉత్తమ నటుడిగా 'రానా నాయుడు'.. ఇండియన్ టెలీ అవార్డ్..! - Rtvlive.com