Rana Naidu: ఉత్తమ నటుడిగా 'రానా నాయుడు'.. ఇండియన్‌ టెలీ అవార్డ్..!

ఇండియన్‌ టెలీ అవార్డ్స్ 2024 అవార్డ్స్ వేడుక శుక్రవారం అట్టహాసంగా జ‌రిగింది. ఈ ఈవెంట్ లో టాలీవుడ్ హీరో రానా ద‌గ్గుబాటి ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. రానా రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్ 'రానా నాయుడు' వెబ్ సిరీస్ గానూ ఈ అవార్డును పొందారు.

New Update
Rana Naidu: ఉత్తమ నటుడిగా 'రానా నాయుడు'.. ఇండియన్‌ టెలీ అవార్డ్..!

Rana Naidu: ఇండియన్‌ టెలీ అవార్డ్స్ 2024 అవార్డ్స్ వేడుక శుక్రవారం అట్టహాసంగా జ‌రిగింది. ఈ వేడుకల్లో సినీ నటులు పలు విభాగాల్లో అవార్డులు అందుకున్నారు. ఇందులో టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి బెస్ట్ యాక్టర్ అవార్డు సొంతం చేసుకున్నారు. రానా నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ 'రానా నాయుడు' వెబ్ సీరీస్ కు గానూ ఈ అవార్డు వరించింది. అయితే ఈ అవార్డు వేడుకకు రానా హాజరు కాలేకపోవడంతో.. అతని తరుపున దర్శకుడు క‌ర‌న్ హ‌న్షుమాన్ ఈ అవార్డును అందుకున్నారు. ఇండియన్‌ టెలీ అవార్డ్ 2024 లో ఉత్తమ నటుడిగా అవార్డు సొంతం చేసుకోవడం పై హీరో రానా సంతోషం వ్యక్తం చేశారు. ఈ పురస్కారానికి ఎంపిక కావడం గౌరవంగా ఉంది’’ అంటూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్‌ చేశారు.

'రానా నాయుడు'

విక్టరీ వెంకటేష్- రానా కాంబోలో నెట్ ఫ్లిక్స్ వేదికగా విడుదలైన ఈ సీరీస్ అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సీరీస్ లో వెంకటేష్ -రానా తండ్రి కొడుకులుగా నటించారు. సుచిత్ర పిళ్లై, గౌరవ్‌ చోప్రా, సుర్వీన్‌ చావ్లా, ప్రియా బెనర్జీ, ఆదిత్యా మీనన్‌, అభిషేక్ బెనర్జీ, సుశాంత్ సింగ్, మిలింద్‌ పాఠక్‌, ఆశిష్‌ విద్యార్థి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఇది ఇలా ఉంటే ఇటీవలే ఈ సీరీస్ కు సీక్వెల్ గా 'రానా నాయుడు' సీజన్ 2' త్వరలో రాబోతున్నట్లు తెలిపారు మేకర్స్ . దీనికి సంబంధించి చిన్న గ్లిమ్ప్స్ వీడియోను కూడా రిలీజ్ చేశారు. దీంతో సీజన్ 2 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: Shraddha Kapoor: నేను అప్పుడే పెళ్లి చేసుకుంటా.. ? పెళ్లి పై శ్రద్ధ కపూర్ క్లారిటీ..! - Rtvlive.com 

Advertisment
తాజా కథనాలు