OTT Releases: ఈ వారం ఓటీటీలో అదిరిపోయే సినిమాలు, సిరీస్‌లు.. లిస్ట్ ఇదే..!

ఈ వారం ఓటీటీ ప్రియులను అలరించేందుకు పలు ఆసక్తికర సినిమాలు, సిరీస్‌లు సిద్ధంగా ఉన్నాయి. విజయ్ సేతుపతి 'మహారాజ', ఫహద్ ఫాజిల్ 'ధూమం', యంగ్ బ్యూటీ శివాని రాజశేఖర్ 'జిలేబీ', సుదీర్ బాబు ‘హరోం హర’ చిత్రాలు జులై 12 నుంచి ఓటీటీలో అలరించనున్నాయి.

OTT Releases: ఈ వారం ఓటీటీలో అదిరిపోయే సినిమాలు, సిరీస్‌లు.. లిస్ట్ ఇదే..!
New Update

OTT Releases This Week: ప్రస్తుతం థియేటర్స్ లో కల్కి 2898 AD హవా కొనసాగుతోంది. రిలీజై 15 రోజులు దాటినా ప్రభాస్ కల్కి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు వసూళ్లను నమోదు చేస్తోంది ఈ చిత్రం. మైథాలజీ- సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ గ్యాప్ లో ఓటీటీ ప్రియులను అలరించేందుకు అదిరిపోయే సినిమాలు, సీరీస్ లు సిద్ధమయ్యాయి. ప్రతీ వారం మాదిరిగానే ఈ వారం కూడా పలు ఆసక్తికర చిత్రాలు ఓటీటీలో అలరించేందుకు వస్తున్నాయి. ఆ చిత్రాలు, సీరీస్ ల వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాము

ధూమం (Dhoomam)

మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil) లేటెస్ట్ మూవీ 'ధూమం'. గతేడాది విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు దాదాపు 12 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.

మహారాజ (Maharaja)

నిథిలన్‌ స్వామినాథన్‌ దర్శకత్వంలో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) లేటెస్ట్ ఫిల్మ్ ‘మహారాజ’. జూన్ 14న విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేస్తుంది. జులై 12 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.

‘హరోం హర’ (Haromhara)

హీరో సుదీర్ బాబు (Sudheer Babu) నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘హరోం హర’. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ‘ఈటీవీ విన్‌’, 'ఆహా' లో నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

‘జిలేబి’

శివానీ రాజశేఖర్‌, శ్రీకమల్‌ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘జిలేబి’. ఈ చిత్రం జులై 13వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. దర్శకుడు కె.విజయభాస్కర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

  • రిసీవర్‌ (వెబ్‌సిరీస్): నెట్‌ఫ్లిక్స్‌ జులై 10
  • వైల్డ్‌ వైల్డ్ పంజాబ్‌: నెట్‌ఫ్లిక్స్‌ జులై 10
  • మాస్టర్‌ మైండ్‌ (వెబ్‌సిరీస్‌): జులై 10 (డిస్నీ+హాట్‌స్టార్‌)
  • అగ్నిసాక్షి (తెలుగు సిరీస్‌): జులై 12(డిస్నీ+హాట్‌స్టార్‌ )
  • పిల్‌: జులై 12 (జియో సినిమా)
  • సింప్లీసౌత్‌ : జులై 12 (జియో సినిమా)
  • మందాకిని: జులై 12 జియో సినిమా)
  • 36 డేస్‌ (హిందీ సిరీస్‌): జులై 12 (సోనీలివ్‌)

Also Read: Ram Charan: ముంబై ఎయిర్ పోర్ట్ లో రామ్ చరణ్ ఫ్యామిలీ..క్లింకార ఎంత క్యూట్ గా ఉందో..! వీడియో వైరల్

#vijay-sethupathi #sudheer-babu #this-week-ott-releases
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe