Sholay Remake : సల్మాన్ ఖాన్ (Salman Khan) ప్రస్తుతం 'సికిందర్' సినిమాతో బిజీగా ఉన్నారు. ఏఆర్ మురుగదాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2025 లో బక్రీద్ (Bakrid) కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
సలీమ్ ఖాన్ షోలే రీమేక్
ఇది ఇలా ఉంటే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సల్మాన్ ఖాన్ తాను రీమేక్ చేయాలనుకుంటున్న సినిమా గురించి తెలిపారు. ఫిల్మ్ మేకర్ ఫరా ఖాన్ ఇంటర్వ్యూతో సందర్భంగా.. ఏ చిత్రాన్ని రీమేక్ చేయాలని ఉంది అని ప్రశ్నించగా.. తన తండ్రి సలీం ఖాన్- జావేద్ అక్తర్ రాసిన యాక్షన్-డ్రామా 'షోలే' (Sholay) చిత్రాన్ని రీమేక్ చేయాలనే కోరిక ఉన్నట్లు తెలిపారు. అలాగే రీమేక్ లో అమితాబ్ బచ్చన్, ధర్మేంద్రతో పాటు తాను కూడా నటించాలనుకుంటున్నట్లు చెప్పారు.
1975లో విడుదలైన 'షోలే' బాలీవుడ్ (Bollywood) చారిత్రక చిత్రాలలో ఒకటి. 49 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సినిమా కథను సల్మాన్ తండ్రి సలీం, జావేద్ రాయగా.. రమేష్ సిప్పీ తెరకెక్కించారు. ఇందులో అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర ప్రధాన పాత్రలో నటించగా.. సంజీవ్ కుమార్, హేమా మాలిని, అమ్జద్ ఖాన్, జయ బచ్చన్ కీలక పాత్రల్లో పోషించారు. సలీం ఖాన్- జావేద్ అక్తర్ షోలే', 'దీవార్' వంటి కల్ట్ క్లాసిక్ చిత్రాలకు రచయితలుగా వ్యవహరించారు. షారుఖ్ ఖాన్, కాజోల్ 'దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే' తో పాటు థియేటర్‌లలో ఎక్కువ కాలం నడిచిన సినిమాల్లో ఒకటిగా 'షోలే' ఉంటుంది. ఇటీవలే రచయితలు సలీం-జావేద్‌ల సినీ ప్రయాణాన్ని ఆధారంగా రూపొందిన డాక్యుమెంటరీ-సిరీస్ యాంగ్రీ యంగ్ మెన్ అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. ఈ చిత్రాన్ని నేషనల్ అవార్డు విన్నర్ నమ్రత రావ్ తెరకెక్కించారు.
Also Read: VIDAAMUYARCHI: 'విదాముయార్చి' రిలీజ్ అప్డేట్ .. వైరలవుతున్న పోస్టర్ - Rtvlive.com