VIDAAMUYARCHI : 'విదాముయార్చి' రిలీజ్ అప్డేట్ .. వైరలవుతున్న పోస్టర్

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'విదాముయార్చి'. తాజాగా ఈ మూవీ విడుదలకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరలవుతోంది. ఈ సినిమాను అక్టోబర్ 31న రిలీజ్ చేయనున్నట్లు కొత్త పోస్టర్ ఒకటి చక్కర్లు కొడుతుంది. కానీ దీనిపై మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవాల్సి ఉంది.

New Update
VIDAAMUYARCHI : 'విదాముయార్చి' రిలీజ్ అప్డేట్ .. వైరలవుతున్న పోస్టర్

VIDAAMUYARCHI Release Update : కోలీవడ్ (Kollywood) స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar), త్రిష (Trisha) జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'విదాముయార్చి'. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని లైకా బ్యానర్ పై మగిజ్ తిరుమేని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్, త్రిష- అజిత్ పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీనీ పెంచాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా 'విదాముయార్చి' విడుదలకు  సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ సినిమాను అక్టోబర్ 31న దీపావళి కానుకగా విడుదల చేయనున్నట్లు కొత్త పోస్టర్ ఒకటి చక్కర్లు కొడుతుంది. అయితే దీనిపై మేకర్స్ ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్‌ అందిస్తున్నారు. ఓ ట్రిప్ కు వెళ్లిన భార్యాభర్తల కథ అనుకోని మలుపు ఎలా తిరిగింది. ట్రిప్ లో తప్పిపోయిన భార్యను వెతికే ప్రయత్నంలో భర్తకు ఎదురైన సంఘటనలు ఏంటి అనే నేపథ్యంలో ఈ సినిమా కథ ఉండబోతుంది

Also Read:VIDAAMUYARCHI : యాక్షన్ కింగ్ అర్జున్ ఫస్ట్ లుక్.. ‘విదాముయార్చి’ పోస్టర్ వైరల్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు