Keerthy Suresh : ఆ విషయంలో చిరంజీవి కంటే ఆ హీరో బెటర్.. కీర్తి సురేష్ కామెంట్స్ ..!

నటి కీర్తి సురేష్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో స్టార్ హీరోలలో బెస్ట్ డ్యాన్సర్స్ ఎవరనే దాని గురించి ఆసక్తికరంగా బదులిచ్చింది. చిరంజీవి, దళపతి విజయ్‌లలో ఎవరి డాన్స్ ఇష్టమని అడగగా.. తన ఫేవరెట్ డ్యాన్సర్ విజయ్ అని చెప్పింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Keerthy Suresh : ఆ విషయంలో చిరంజీవి కంటే ఆ హీరో బెటర్.. కీర్తి సురేష్ కామెంట్స్ ..!
New Update

Keerthy Suresh Shocking Comments On Chiranjeevi Dance : మహానటి కీర్తిసురేష్ (Keerthy Suresh) తమిళ్ లో రఘుతాత, హిందీలో బేబీ జాన్ సినిమాలతో బిజీగా ఉంది. గ్లామర్, నటనతో సౌత్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దు గుమ్మ. తెలుగులో చిరంజీవి, మహేష్ బాబు, నాని, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. తాను చేసిన కామెంట్స్ కారణంగా ట్రోలింగ్ ఎదుర్కొంటోంది ఈ ముద్దుగుమ్మ. స్టార్ హీరోలలో బెస్ట్ డ్యాన్సర్స్ (Best Dancers) ఎవరనే దాని గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

publive-image

చిరంజీవి కంటే విజయ్ బెస్ట్ డాన్సర్: కీర్తి

ఇంటర్వ్యూలో మొదటగా.. యాంకర్ ధనుష్, నానిలలో మీకు ఇష్టమైన డ్యాన్సర్ ఎవరు అని అడగగా.. ధనుష్ (Dhanush) అని చెప్పింది. ఆ తర్వాత ధనుష్- అల్లు అర్జున్ లలో అల్లు అర్జున్ అని , అల్లు అర్జున్, మహేష్ బాబు లలో అల్లు అర్జున్ అని, అల్లు అర్జున్, చిరంజీవి లలో చిరంజీవి అని తెలిపింది. ఇక చివరిగా చిరంజీవి- విజయ్ దళపతి ఇద్దరిలో ఇష్టమైన డాన్సర్ ఎవరని అడగగా.. విజయ్ దళపతి (Vijay Thalapathy) అని చెప్పింది. దీంతో నెటిజన్లు చిరంజీవి కంటే బెస్ట్ డాన్సర్ ఎలా అవుతారో అర్థం కావడం లేదంటూ సోషల్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, నటనతో పాటు చిరంజీవి అద్భుతమైన డాన్సర్ అనే విషయం అందరికీ తెలిసిందే. యువ హీరోలు సైతం డాన్స్ లో ఆయన గ్రేస్, స్టైల్ చూసి ఫిదా అవుతుంటారు. ఆ విధంగా ఆయనను అభిమానించే వారు కీర్తి చెప్పిన సమాధానానికి రియాక్ట్ అవుతున్నట్లుగా తెలుస్తోంది.

Also Read: Mohanlal: లెఫ్టినెంట్ కల్నల్‌ హోదాలో.. వయనాడ్‌లో మోహన్ లాల్ పర్యవేక్షణ - Rtvlive.com

#keerthi-suresh #chiranjeevi #vijay-thalapathy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe