Encounter in Chhattisgarh: ఛత్తీస్గఢ్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. తాజాగా భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పు ల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.. మరో ఏడుగురు మావోయిస్టులకు గాయాలు అయ్యాయి. బీజాపూర్ జిల్లా గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధి పోట్చేరి, సావనార్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీస్‌లు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.
వరుస కాల్పులు:
మార్చి 27న కూడా ఛత్తీస్గఢ్ బీజాపుర్ జిల్లా చికుర్బత్తి - పుస్బాక సమీపంలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్కౌంకౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలతో పాటు ఆరుగురు నక్సల్స్ మృతి చెందగా.. పలువురు నక్సలైట్లు గాయపడ్డారు. కాల్పులు ఆగిన తర్వాత ఘటనా స్థలం నుంచి మృతదేహాలతోపాటు భారీ ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని సుందర్ రాజ్ వెల్లడించారు.
ఎన్నికల వేళ భద్రతను కట్టుదిట్టం:
అయితే.. ఏప్రిల్ 19న బీజాపుర్ జిల్లా బస్తరలో లోక్‌సభ తొలి విడతలోనే పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల నేపథ్యంలో అధికారులు జిల్లా వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలింగ్ సమయంలో ఎలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు నిఘా పెట్టామని అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: ఇక నో టెన్షన్.. ఇంట్లోనే కూర్చొని ప్రతి నెలా సంపాదించవచ్చు.. ఎలాగంటే?