Ghee Drink: ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో నెయ్యి కలిపి తాగితే మంచిదా?

గోరువెచ్చని నీటిలో కాస్త నెయ్యి కలిపి తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలతోపాటు కీళ్లకు, జీర్ణవ్యవస్థకు, తల, చర్మానికి మంచిదని నిపుణులు అంటున్నారు. దీనిని ఉదయాన్నే పరగడుపున సేవిస్తే మధుమేహ వ్యాధిగ్రస్తులకు చక్కెరస్థాయి పెరిగే అవకాశం తక్కువగా ఉంటుంది.

New Update
Ghee Drink: ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో నెయ్యి కలిపి తాగితే మంచిదా?

Ghee Drink: చాలా మంది ఆయుర్వేద ఔషధ మూలికలను ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. గోరువెచ్చని నీటిలో కాస్త నెయ్యి కలపడం అందులో ఒకటి. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇలా నెయ్యిని నీటిలో కలిపి తాగడం వల్ల మలబద్ధకం సమస్య నుండి ఎముకల నొప్పి, చర్మ ఆరోగ్యం, శిరోజాల ఆరోగ్యం వరకు అన్నింటికీ మంచిదని అంటున్నారు.

కీళ్లకు చాలా మంచిది:

  • నెయ్యి తినడం వల్ల మన కీళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటాయి. కొందరికి చేతులు, కాళ్లలో నొప్పి వస్తుంటుంది. దీనికి ప్రధాన కారణం కీళ్లలో వాటి కదలికకు సహాయపడే ద్రవం లేకపోవడమే అని నిపుణులు అంటున్నారు. నెయ్యిలో ఉండే జిడ్డు వల్ల కీళ్లలో లూబ్రికేషన్ పెరుగుతుంది. దీంతో కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

రక్తంలో షుగర్‌ లెవెల్స్‌ కంట్రోల్‌:

  • గోరువెచ్చని నీటిలో కాస్త నెయ్యి కలుపుకుని ఉదయాన్నే పరగడుపున సేవిస్తే మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. వారి రక్తంలో చక్కెర స్థాయి మెరుగ్గా ఉంటుంది. తిన్న వెంటనే చక్కెర స్థాయి పెరిగే అవకాశం తక్కువగా ఉంటుంది.

జీర్ణవ్యవస్థకు మంచిది:

  • నెయ్యిలో మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. తిన్న ఆహారం బాగా జీర్ణమవుతుంది. దీంతో అజీర్తి సమస్యలు ఉండవు.

మలబద్ధకం:

  • నెయ్యిలోని కొవ్వు ప్రేగు కదలికలను సాఫీగా చేస్తుంది. మలబద్ధకం సమస్యను దూరం చేయడంలో నెయ్యి బాగా పనిచేస్తుంది. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో నెయ్యి కలిపి తింటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా బరువు తగ్గించడంలోనూ సమర్థవంతంగా పనిచేస్తుంది. గోరువెచ్చని నీళ్లలో నెయ్యి కలుపుకుని ఉదయాన్నే తాగితే కాసేపటికి కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దీని ద్వారా శరీర బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.

తల, చర్మానికి మంచిది:

  • నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి. ఇవి మన చర్మం, శిరోజాల ఆరోగ్యాన్ని కాపాడతాయి.

ఇది కూడా చదవండి: నిద్రకు వయసుకు సంబంధం ఉందా?…ఏ వయసు వాళ్ళు ఎంత నిద్ర పోవాలి?

గమనిక: కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు