AP Govt Recruitment : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తమ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వివిధ శాఖల్లోని ఖాళీలను భర్తి చేసేందుకు నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ క్రమంలోనే పశ్చిమగోదావరి జిల్లా రెవెన్యూ విభాగంలో (ఏలూరు) మిగిలివున్న టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు కూడా దరఖాస్తులు కోరింది. అయితే ఇందుకోసం నిరుద్యోగ అభ్యర్థులను మరోసారి అలర్ట్ చేసింది. ఈ ఉద్యోగాలకోసం అప్లై చేసుకునేవారికి నవంబరు 30వ తేదీని తుది గడువుగా ప్రకటించారు. దీంతో ఇంకా ఒక్కరోజే సమయం మిగిలివుందని, త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
Also read :బొచ్చెడుసార్లు మోసపోయా.. లవ్ ఫెయిల్యూర్ పై స్పందించిన శ్రీముఖి
ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. రెవెన్యూ డిపార్ట్ మెంట్, పశ్చిమగోదావరి జిల్లా(ఏలూరు)లో మొత్తం టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ కు సంబంధించి 12 ఖాళీలున్నాయి. అయితే ఇందుకు కావాల్సిన అర్హతలు.. డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ లేదా బీఈ, బీటెక్/ ఎంసీఏ చదివివుండాలి. అలాగే టైపింగ్ శిక్షణ తీసుకున్నట్లు సర్టిఫికెట్ తప్పనిసరి. వయసు 18 - 42 ఏళ్ల మధ్య ఉండాలి. అకాడమిక్ మార్కుల ఆధారంగా ఆన్ లైన్ లోనే ఎంపిక విధానాన్ని చేపడతారు. షార్ట్ లిస్ట్ అయిన వారికి కంప్యూటర్ పరిజ్ఞానం, టైపింగ్ పై పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ ప్రాతిపాదికన భర్తీ చేయనుండగా జీతం రూ. 18,500 చెల్లిస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ 2023 నవంబర్ 30.
అధికారిక వెబ్ సైట్ - https://westgodavari.ap.gov.in