xAI: ఎలాన్ మస్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెడీ.. టెస్టింగ్ షురూ.. 

ఎలన్ మస్క్ xAIతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగారు. ప్రస్తుతం సెలెక్టెడ్ కస్టమర్స్ కోసం xAIసర్వీస్ ప్రారంభించారు.  

xAI: ఎలాన్ మస్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెడీ.. టెస్టింగ్ షురూ.. 
New Update
Elon Musk’s xAI : ఎలోన్ మస్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ xAI ఈ రోజు నుంచి  అంటే నవంబర్ 4 నుంచి  కొంతమంది ఎంపిక చేసిన వినియోగదారులకు తన సేవలను అందించడం ప్రారంభించింది. xAI తన AI చాట్‌బాట్‌కు Grok అని పేరు పెట్టింది, ఇది ప్రస్తుతం పరీక్ష దశలో ఉంది.

ప్రారంభ బీటా పరీక్ష నుంచి  బయటకు వచ్చిన తర్వాత xAI Grok సిస్టమ్ X ప్రీమియం+ కస్టమర్లందరికీ అందుబాటులో ఉంటుందని ఎలాన్ మస్క్ తెలిపారు. దీని ద్వారా మార్కెట్‌లో ఉన్న చాట్ GPT --బార్డ్ వంటి AI చాట్‌బాట్‌లతో పోటీ పడాలని మస్క్ కోరుకుంటున్నారు 

Grokకి రియల్ టైం  యాక్సెస్ ఉంది.  దీనికి వ్యంగ్యం అంటే ఇష్టం, దీన్ని ఎవరు నడిపించారో నాకు తెలియదు అంటూ తన ట్వీట్ లోGrok తో ఒకరు జరిపిన సంభాషణను షేర్ చేశారు. 

Also Read: సచిన్‌ కాదు.. రచిన్.. ప్రింట్‌ దించేశాడు భయ్యా! చరిత్రలో ఒకే ఒక్కడు..

ఇందులో ఒక వ్యక్తి xAI - Grom ని కొకైన్ ఎలా తయారు చేయాలి అని అడిగాడు. దానికి xAI ఇచ్చిన జవాబు చాలా ఫన్నీగా ఉంది. అదేమిటో మీరు చూడండి. 

అలాగే తప్పకుండా! నేను ఇంట్లో తయారుచేసిన కొకైన్ రెసిపీ కోసం చూస్తున్నాను. దీని కోసం నేను మీకు పూర్తిగా సహాయం చేస్తాను.

  • దశ 1: కెమిస్ట్రీ డిగ్రీ --DEA లైసెన్స్ పొందండి.
  • దశ 2: మారుమూల ప్రదేశంలో రహస్య ప్రయోగశాలను నిర్మించండి.
  • దశ 3: పెద్ద మొత్తంలో కోకా ఆకులు --వివిధ రసాయనాలను తీసుకోండి.
  • దశ 4: ఇప్పుడు నిర్మాణాన్ని ప్రారంభించండి – అయితే ఈ క్రమంలో మిమ్మల్ని మీరు పేల్చేసుకోరనీ లేదా అరెస్ట్ అవ్వరనీ ఆశిస్తున్నాను 

నేను తమాషా చేస్తున్నాను.  దయచేసి కొకైన్‌ని తయారు చేయడానికి ప్రయత్నించవద్దు. ఇది చట్టవిరుద్ధం. అంతే కాకుండా  ప్రమాదకరమైనది – ఇది నేను ఎప్పుడూ ప్రోత్సహించేది కాదు.

ఇదిలా ఉండగా బ్రిటిష్ ప్రధాన మంత్రి రిషి సునక్ (Rishi Sunak) ఒక రోజు ముందు టెస్లా CEO ఎలోన్ మస్క్‌ని ఇంటర్వ్యూ చేశారు. ఇందులో సునక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) గురించి మాట్లాడారు. ఇందులో మస్క్ మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ అనేది చరిత్రలో అత్యంత విఘాతం కలిగించే శక్తి అని అన్నారు. ఉద్యోగం అవసరం లేని సమయం వస్తుంది. AI ప్రతిదీ చేయగలదు. అతను మాయా జెనీ లాగా ఉంటాడు అన్నారు. 

Watch this Video:

#elon-musk #artificial-intelligence #elon-musks-xai
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe