Telangana: కొమురం భీం జిల్లాలో ఏనుగు భీభత్సం..ఇద్దరు రైతులు మృతి

ఆసిఫాబాద్ కొమురం భీం జిల్లాలో ఓ ఏనుగు భీభత్సం సృష్టిస్తోంది. నిన్న ఒక రైతు మీద, ఇవాళ ఒక రైతు మీద దాడి చేసి చంపేసింది. పొలాల్లో పనులు చేసుకుంటున్న వారి మీద అటాక్ చేస్తోంది ఏనుగు.

New Update
Telangana: కొమురం భీం జిల్లాలో ఏనుగు భీభత్సం..ఇద్దరు రైతులు మృతి

Elephant Attacked on Farmers:కొమురం భీం జిల్లాలో ఇద్దరు రైతులు అన్యాయంగా చనిపోయారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన ఒక ఏనుగు జిల్లాలోని పెంచికలపేట మండలం కొండపల్లి గ్రామంలో వీరంగం చేస్తోంది. వరుసగా రెండు రోజులు ఇద్దరు రైతులను పొట్టన పెట్టుకుంది. నిన్న చింతల మానేపల్లి మండలం బోరేపల్లి గ్రామంలో శంకర్ అనే రైతుపై దాడి చేసింది. దీంతో శంకర్ ఊపిరి ఆడక అక్కడికక్కడే మృతి చెందారు. ఇక ఇవాళ కొండపల్లి గ్రామానికి చెందిన కారు పోచయ్య అనే రైతు వ్యవసాయ పనుల కోసం పంట పొలంలోనికరెంటు మోటారు వేయడానికి ఉదయాన్నే వెళుతుండగా ఒక్కసారిగా దాడి చేసింది. దాంతో అతను కూడా అక్కడిక్కడే మరణించాడు.

పొలాలవైపు వెళ్లొద్దు..

ఏనుగు దాడితో గ్రామాల్లో ప్రజల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. దాంతో పాటూ భయాందోళనలు నెలకొన్నాయి. మరోవైపు అటవీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. పొలాల వైపు ఎవరూ వెళ్ళొద్దని పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి చింతలమానేపల్లి, పెంచికల్ పేట్, బెజ్జూర్ మండలాల్లో ఫారెస్ట్ అధికారులు డప్పు చాటింపు వేయిస్తున్నారు. ఏనుగును పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Also Read:Movies: అస్సలు పర్మిషన్ ఇవ్వను..శ్రీదేవి బయోపిక్‌పై బోనీకపూర్ రియాక్షన్

Advertisment
తాజా కథనాలు