Mizoram Elections: రేపే మిజోరాం ఎన్నికలు.. ఆ మూడు పార్టీల మధ్యే గట్టి పోటీ..

మిజోరాంలో ఆదివారం ఎన్నికల ప్రచారం ముగిసింది. మంగళవారం అక్కడ 40 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 174 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మూడు ప్రధానపార్టీల మధ్య ఆ రాష్ట్రంలో త్రిముఖ పోరు నెలకొంది.

New Update
Mizoram Elections: రేపే మిజోరాం ఎన్నికలు.. ఆ మూడు పార్టీల మధ్యే గట్టి పోటీ..

మరికొన్ని రోజుల్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో రాజకీయాలు హీటెక్కాయి. అధికార, విపక్ష పార్టీలు జోరుగా ప్రచారాలు చేస్తున్నాయి. అయితే ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రం నాటికి ముగిసింది. ఇక ఆ రాష్ట్రంలో మంగళవారం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 40 నియోజకవర్గాలకు ఒకే విడుతలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. మిజోరాంలో 8.57 లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 174 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో పోటీపడుతున్నారు. ఇప్పటికే అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 1,276 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే అంతఃరాష్ట్ర, అంతర్జాతీయయ సరిహద్దుల్లో 30 పోలింగ్ కేంద్రాలను సున్నితమైనవిగా గుర్తించామని.. ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి హెచ్ లియాంజెలా తెలిపారు.

బంగ్లాదేశ్‌, మయన్మార్‌తో సరిహద్దులు పంచుకొనే ప్రాంతాల్లో ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేశామని పోలీసులు చెప్పారు. మొత్తం 3 వేల మంది పోలీసు సిబ్బంది, 5,400 మంది కేంద్ర సాయుధ బలగాలను మోహరించామని పేర్కొన్నారు. మిజోరాంలో మూడు ప్రధాన పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. అధికార మిజో నేషనల్‌ ఫ్రంట్‌ (ఎంఎన్‌ఎఫ్‌), ప్రతిపక్ష కాంగ్రెస్‌, జోరం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌(జెడ్‌పీఎం) మధ్య గట్టి పోటీ ఉండనుంది. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు మిజో నేషనల్ ఫ్రంట్ ముమ్మరంగా ప్రచారాలు చేసింది. గత ఐదేళ్లలో తాము చేసిన అభివృద్ధితో పాటు శరణార్థులు, ఇతర ప్రాంతాల నుంచి వలసల అంశాలను కూడా తమ ప్రచారంలో ఉపయోగించుకునేందుకు యత్నించింది.

Also read: అధికారితో బలవంతంగా పంట వ్యర్థాలను దగ్ధం చేయించిన రైతులు..

ఇక మిజారాల్లో అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఈసారి ఎలాగైన అధికార పగ్గాలు చేపట్టాలని పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా ఎంఎన్‌ఎఫ్ పార్టీ గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందనే ప్రచార అస్త్రాలతో దూకుడు చూపించింది. మరోవైపు గత ఎన్నికల్లో 8 స్థానాల్లో గెలిచిన జోరం పీపుల్ మూవ్‌మెంట్ పార్టీ ఈసారి ఎన్నికల్లో కింగ్ మేకర్‌గా నిలిచి.. ప్రభుత్వ ఏర్పాటులో తమ పాత్రను పోషించాలే లక్ష్యంతో ముందుకెళ్లింది. మార్పు రావాలనే నినాదాంతో ప్రచారాలు చేసి కొత్త పాలన వ్యవస్థ తీసుకొస్తామని హామీ ఇచ్చింది. ఇక మిగత నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా త్వరలో జరగనున్నాయి. డిసెంబర్ 3న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు