Telangana Elections: తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు: సీఈవో

తెలంగాణలో యథా ప్రకారమే ఎన్నికలు జరగనున్నట్లు పూర్తి స్పష్టత వచ్చేసింది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో జమిలీ ఎన్నికల బిల్లు అంశం తెరపైకి రాకపోవడంతో ఇక అన్ని రాష్ట్రాల్లో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగనున్నాయని తేలిపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ కీలక ప్రకటన చేశారు.

CEO Vikas Raj: రాజ్‌భవన్‌కు సీఈవో వికాస్ రాజ్‌..
New Update

Telangana Elections: తెలంగాణలో యథా ప్రకారమే ఎన్నికలు జరగనున్నట్లు పూర్తి స్పష్టత వచ్చేసింది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో జమిలీ ఎన్నికల బిల్లు అంశం తెరపైకి రాకపోవడంతో ఇక అన్ని రాష్ట్రాల్లో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగనున్నాయని తేలిపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని.. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నామని క్లారిటీ ఇచ్చేశారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 3,4,5 తేదీల్లో కేంద్ర ఎన్నికల బృందం రాష్ట్రంలో పర్యటిస్తుందని పేర్కొన్నారు.

కొత్తగా 15 లక్షల మంది ఓటర్లు..

ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకూ కొత్తగా 15 లక్షల మందిని ఓటర్ల జాబితాలో చేర్చామని.. అలాగే 3.38 లక్షల మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించినట్లు తెలిపారు. కొత్తగా చేర్చిన ఓటర్లలో 18, 19 వయసు ఉన్న యువ ఓటర్లు 6.99 లక్షల మంది ఉన్నారన్నారు. ముఖ్యంగా మహిళా ఓట్లు సంఖ్య పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నామని ఆయన వివరించారు. ఇంటి నుంచి ఓటింగ్ వేసే వారిని గుర్తించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. త్వరలోనే అన్ని రాజకీయ పార్టీలు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సీఎస్‌తో సమావేశాలు నిర్వహించనున్నట్లు వికాస్ రాజ్ ప్రకటించారు.

రాష్ట్రంలో అలుముకున్న ఎన్నికల వాతావరణం..

ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం అలుముకుంది. నేతలు జనాల్లో పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు. అధికార, ప్రతిపక్షాలు పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. అధికార బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించడంతో వారు అన్ని పార్టీల కంటే ముందుగానే ఎన్నికల బరిలో దూసుకుపోతున్నారు. ఇక త్వరలోనే కాంగ్రెస్, బీజేపీ కూడా అభ్యర్థులను ప్రకటించనుంది. ఓవైపు ఢిల్లీ నేతలు రాష్ట్రానికి క్యూకడుతున్నారు. అటు కమలదళం నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఇటీవలే రెండు సార్లు రాష్ట్రంలో పర్యటించి నాయకులకు దిశానిర్దేశం చేశారు. విభేదాలను పక్కనబెట్టి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. మరోవైపు కాంగ్రెస్ పెద్దలు కూడా సీడబ్ల్యూసీ సమావేశం హైదరాబాద్‌లోనే ఏర్పాటుచేసి పొలిటికల్ హీట్ పెంచేశారు. అనంతరం భారీ బహిరంగ సభ ద్వారా ఆరు గ్యారంటీ హామీలను కూడా సోనియా గాంధీ ప్రకటించి ఎన్నికల శంఖారావం పూరించారు. ఇక అభ్యర్థులను ప్రకటించడమే మిగిలింది.

మరో రెండు నెలల్లోనే ఎన్నికలు..

ఇన్ని రోజులు జమిలీ ఎన్నికలు జరుగుతాయి ఏమో అన్న అనుమానం అన్ని పార్టీల్లో ఉండటంతో ప్రచార దూకుడు కాస్త తగ్గించారు. ఇక ఇప్పుడు జమిలీ ఎన్నికలు లేవని స్పష్టత రావడం, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సైతం షెడ్యూల్ ప్రకారమే మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయని ప్రకటించడంతో ఇక రాష్ట్రంలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకోనుంది.

ఇది కూడా చదవండి: ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త.. ఆ జిల్లాల నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు డీలక్స్ బస్సు.. వివరాలివే!

#telangana-elections #bjp #brs #congress #ceo-vikas-raj
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి