AP Politics : జగన్‌కు పీకే ఝలక్‌.. ఇక టీడీపీ కోసం వ్యూహాలు.. ఇదిగో ప్రూఫ్!

గన్నవరం ఎయిర్పోర్టులో లోకేశ్‌తో పాటు ప్రశాంత్ కిశోర్ కనిపించారు. వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పని చేస్తున్న పీకే లోకేశ్‌తో కనిపించడం ఆసక్తిని రేపుతోంది. ప్రస్తుతం టీడీపీ ఎన్నికల వ్యూహకర్తగా రాబిన్ ఉన్నారు. ఇక పీకేకి టీడీపీ గెలుపు బాధ్యతలు అప్పగించినట్టు ప్రచారం జరుగుతోంది.

New Update
AP Politics : జగన్‌కు పీకే ఝలక్‌.. ఇక టీడీపీ కోసం వ్యూహాలు.. ఇదిగో ప్రూఫ్!

PK : ఇప్పటివరకు జగన్‌కు ఎన్నికల వ్యూహకర్తగా పని చేస్తున్న ప్రశాంత్‌ కిశోర్‌(Prashant Kishor) రూటు మార్చినిట్టుగా ప్రచారం జరుగుతోంది. ప్రశాంత్‌ కిశోర్‌కు చెందిన ఐపాక్‌ టీమ్‌ 2019ఎన్నికల్లో జగన్‌(YS Jagan) పార్టీ భారీ విజయం వెనుక కీ రోల్ ప్లే చేసింది. నిన్నమొన్నటివరకు కూడా జగన్‌తోనే ఐపాక్‌ టీమ్‌ ఉంది. అయితే తాజాగా టీడీపీ నేత, చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌తో ప్రశాంత్‌ కిశోర్‌ కనిపించడం కాక రేపుతోంది.

publive-image

లోకేశ్‌ను ప్రశాంత్‌ కిశోర్ ఎందుకు కలిశారు? ఇక నుంచి టీడీపీ కోసం ఐపాక్‌ టీమ్‌ పని చేయనుందా? జగన్‌తో పీకేకు చెడిందా? ఎన్నికలకు మూడు నెలల సమయం మాత్రమే ఉండడంతో ఈ సమయంలో ప్రశాంత్‌ కిశోర్‌ ప్లేట్‌ తిప్పితే జగన్‌కు తిప్పలు తప్పవా? అసలు జరుగుతున్న ప్రచారంలో నిజమెంత?

ఎయిర్‌పోర్టులో కలిశారు:
గన్నవరం విమానాశ్రయం(Gannavaram Airport)లో ప్రత్యేక విమానంలో లోకేశ్‌తో పాటు ప్రశాంత్ కిశోర్ కనిపించారు. వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పని చేస్తున్న పీకే లోకేశ్‌తో కనిపించడం ఆసక్తిని రేపుతోంది. ప్రస్తుతం టీడీపీ ఎన్నికల వ్యూహకర్తగా రాబిన్ సింఘ్ ఉన్నారు. అయితే ఇప్పటివరకు అటు ఐపాక్‌ కానీ.. ఇటు రాబిన్‌ సింఘ్‌ టీమ్‌ కానీ ప్రశాంత్‌ కిశోర్‌ విషయం గురించి ఎలాంటి ప్రకటనా చేయలేదు.

పీకేకు వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు బాధ్యతలు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. పీకే రాకతో టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. పీకే వ్యూహాలతో తమ గెలుపు ఖాయమంటున్నారు టీడీపీ శ్రేణులు. ప్రస్తుతం టీడీపీకి వ్యూహకర్తగా రాబిన్ సింఘ్‌ ఉండగా వైసీపీ వ్యూహకర్తగా ఉన్న రిషి ఉన్నారు. రాబిన్ శర్మ, రిషి గతంలో పీకే దగ్గర పని చేసిన వారే కావడం విశేషం.

Also Read: ‘సనాతన ధర్మాన్ని ధ్వంసం చేస్తున్నారు’? కాంగ్రెస్‌, బీజేపీ మధ్య ముదురుతున్న వార్‌!

WATCH:

Advertisment
తాజా కథనాలు