మతాల చుట్టూ రాజకీయాలు చేయడం దేశంలో పొలిటికల్ పార్టీలకు అలవాటు. ప్రతీ అంశాన్ని ఓటు బ్యాంక్‌కు వాడుకోవడం ప్రధాన పార్టీలకు కొట్టినపిండే. ఇందులో ఏ పార్టీ తక్కువ కాదు. ఈ ఏడాది కర్ణాటక ఎన్నికలు జరగడానికి ముందు వరకు ఆ రాష్ట్రంలో హిజాబ్ ఇష్యూ తీవ్ర వివాదాస్పదమైంది. కాలేజీల్లో, స్కూల్స్‌లో హిజాబ్ ధరించడాన్ని నాటి బీజేపీ సర్కార్ నిషేధించింది. బసవరాజ్ బొమ్మై ప్రభుత్వ నిర్ణయాన్ని కర్ణాటక హైకోర్టు కూడా సమర్థించింది. దీంతో కాంగ్రెస్ ఇదే అస్త్రంతో ఎన్నికల్లో ప్రచారం చేసింది. ముస్లింలను తమవైపునకు తిప్పుకుంది. ఇక తాజాగా అప్పటి బీజేపీ ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టిపడేస్తూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కీలక ప్రకటన చేశారు. హిజాబ్‌ను నిషేధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నట్లు సిద్ధరామయ్య ప్రకటించారు.
పూర్తిగా చదవండి..Sharia law: ‘సనాతన ధర్మాన్ని ధ్వంసం చేస్తున్నారు’? కాంగ్రెస్, బీజేపీ మధ్య ముదురుతున్న వార్!
హిజాబ్‌ను నిషేధిస్తూ జారీ చేసిన గత ప్రభుత్వ ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ మండిపడింది. షరియా చట్టాలను తీసుకొచ్చి సనాతన ధర్మాన్ని ధ్వంసం చేసేందుకు కుట్ర చేస్తున్నారని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఆరోపించారు.
Translate this News: