దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావిడి మంచి జోరు మీద ఉంది. ప్రధాన పార్టీల ముఖ్య నేతలంతా కూడా ఎన్నికల ప్రచారంలోకి దిగి ఎన్నికల జోరు పెంచారు. ఈ క్రమంలోనే ప్రతి పక్ష నేతల మధ్య మాటల యుద్దాలు జరుగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే.
ఈ వ్యవహరంలో బీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉందంటూ కాంగ్రెస్ నేతలు పదే పదే ఆరోపిస్తున్నారు. అందులోనూ మాజీ మంత్రి కేటీఆర్ పేరును కూడా ప్రస్తావించారు. దీంతో రంగంలోకి దిగిన కేటీఆర్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని తన పై ఆరోపణలు చేస్తున్న వారి పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
ఆయన ఫిర్యాదు చేసిన వారిలో రాష్ట్ర దేవాదాయ , పర్యావరణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా ఒకరు. దీంతో ఈ ఫిర్యాదు పై ఈసీ స్పందించింది. ఎన్నికలు దగ్గరకు వస్తున్న వేళ జాగ్రత్తగా మాట్లాడాలని..కొండా సురేఖకు ఈసీ హెచ్చరికలు జారీ చేసింది. కేటీఆర్‌పై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం తప్పుబట్టింది. ప్రత్యర్థులపై ఆరోపణలు చేసేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలని సూచించింది.
Also read: పరీక్షల్లో జై శ్రీరాం అని రాసినందుకు పాస్ చేశారు..అసలు ట్విస్ట్ ఏంటంటే!