Konda Surekha: ఎన్నికల వేళ మంత్రి కొండా సురేఖకు ఈసీ వార్నింగ్! తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్దం తీవ్రంగా నడుస్తుంది. ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మంత్రి కొండా సురేఖ బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ పై ఆరోపణలు చేశారు. దీంతో ఫిర్యాదు అందుకున్న ఈసీ కొండా సురేఖను జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించింది. By Bhavana 27 Apr 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావిడి మంచి జోరు మీద ఉంది. ప్రధాన పార్టీల ముఖ్య నేతలంతా కూడా ఎన్నికల ప్రచారంలోకి దిగి ఎన్నికల జోరు పెంచారు. ఈ క్రమంలోనే ప్రతి పక్ష నేతల మధ్య మాటల యుద్దాలు జరుగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహరంలో బీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉందంటూ కాంగ్రెస్ నేతలు పదే పదే ఆరోపిస్తున్నారు. అందులోనూ మాజీ మంత్రి కేటీఆర్ పేరును కూడా ప్రస్తావించారు. దీంతో రంగంలోకి దిగిన కేటీఆర్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని తన పై ఆరోపణలు చేస్తున్న వారి పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు చేసిన వారిలో రాష్ట్ర దేవాదాయ , పర్యావరణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా ఒకరు. దీంతో ఈ ఫిర్యాదు పై ఈసీ స్పందించింది. ఎన్నికలు దగ్గరకు వస్తున్న వేళ జాగ్రత్తగా మాట్లాడాలని..కొండా సురేఖకు ఈసీ హెచ్చరికలు జారీ చేసింది. కేటీఆర్‌పై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం తప్పుబట్టింది. ప్రత్యర్థులపై ఆరోపణలు చేసేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలని సూచించింది. Also read: పరీక్షల్లో జై శ్రీరాం అని రాసినందుకు పాస్ చేశారు..అసలు ట్విస్ట్ ఏంటంటే! #ktr #ec #konda-surekha #warning మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి