Ayyanna Patrudu: అయ్యన్నపాత్రుడికి ఈసీ షాక్.. చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు

AP: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడికి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. సీఎం జగన్‌పై అనుచిత, నిరాధార వ్యాఖ్యలు చేశారని ఆయనపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈసీకి ఫిర్యాదు చేశారు. కాగా, ఆయనపై చర్యలు తీసుకోవాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్‌కి ఈసీ ఆదేశాలు ఇచ్చింది.

Ayyanna Patrudu: అయ్యన్నపాత్రుడికి ఈసీ షాక్.. చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు
New Update

EC Serious On TDP Ayyanna Patrudu: టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. సీఎం జగన్‌పై (CM Jagan) అనుచిత, నిరాధార వ్యాఖ్యలు చేశారని అయ్యన్నపాత్రుడపై ఈసీకి వైసీపీ కాంగ్రేడ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు. మల్లాది విష్ణు ఫిర్యాదు మేరకు అయ్యన్నపాత్రుడిపై చర్యలు తీసుకోవాలని ముఖేష్ కుమార్ మీనా ఆదేశం ఇచ్చారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్‌కి ఆదేశాలు జారీ చేశారు.

చంద్రబాబుపై ఈసీ గరం..

బహిరంగ సభల్లో సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని 18 సార్లు సీఈఓకి వైసీపీ ఫిర్యాదు చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ చంద్రబాబుకు పలుమార్లు నోటీసులు జారీ చేశారు సీఈవో ముఖేష్ కుమార్ మీనా. కొన్ని నోటీసులకు మాత్రమే చంద్రబాబు సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి కొన్ని నోటీసులకు చంద్రబాబు స్పందించలేదు. 

చంద్రబాబు ఇచ్చిన సమాధానంపై సీఈవో మీనా సంతృప్తి చెందలేదు. వైసీపీ ఇచ్చిన వీడియో క్లిప్పులను సీఈవో మీనా పరిశీలించారు. చంద్రబాబుపై తదుపరి చర్యలు తీసుకోవాలంటూ ఈసీఐ ముఖ్య కార్యదర్శి అవినాష్ కుమార్‌కు లేఖ రాశారు. వీడియో క్లిప్పులను కూడా జత చేస్తూ సీఈవో లేఖ పంపారు.

Also Read: జగన్ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా..!

#tdp #ap-elections-2024 #ayyanna-patrudu #cm-jagan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe