/rtv/media/post_attachments/9e9acae7c77946030ab089ca9fe4e3dccb3a9abfd35bf7436f6a4752cc1c7553.webp)
CM Revanth Reddy: ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‌రెడ్డి జోరు పెంచారు. నేడు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. నారాయణపేట, నాగర్‌కర్నూలు జిల్లాలో రేవంత్ సుడిగాలి పర్యటనలు చేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు హెలికాఫ్టర్‌లో కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరుకు సీఎం రేవంత్ చేరుకోనున్నారు. గ్రీన్ ప్యాలెస్ గార్డెన్‌లో కాంగ్రెస్ కార్యకర్తలతో సీఎం సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీగురులోక మసంద్ (బావాజీ) జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి నేరుగా బిజినపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. సీఎం పర్యటన సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బహిరంగ సభకు పార్టీ శ్రేణులు సన్నద్ధం అవుతున్నారు. సభను విజయవంతం చేస్తామని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: హనుమాన్ జయంతి ప్రత్యేకత ఇదే..ఇలా స్వామిని పూజించండి