School Bus: తెలంగాణలో స్కూల్బస్సు బోల్తా.. ఎంత మంది విద్యార్థులకు గాయాలయ్యాయంటే..?
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ఘోర పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులను తీసుకెళ్తున్న పాఠశాల బస్సు బోల్తా పడింది. దీంతో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్యం చేస్తున్నారు. పిల్లలకు ఏమైనా జరుగుతుందేమో అని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. భారీగా ఆస్పత్రి దగ్గర చేరుకున్నారు.