Road Accident : జమ్మూ కశ్మీర్ (Jammu & Kashmir) లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనంత్ నాగ్ జిల్లా (Anantnag District) లోని దక్సుమ్ అనే ప్రాంతంలో శనివారం ఓ వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. అయితే ప్రమాదంలో ఐదుగురు చిన్నారులతో సహా 8 మంది మృతి చెందడం కలకలం రేపింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు.
Also Read: రీల్స్ మోజులో పడి చేయి, కాలు పోగొట్టుకున్న యువకుడు
ప్రమాదానికి గురైన టాటా సుమో వాహనం కిష్త్వార్ వైపు నుంచి వస్తుండగా.. అదుపుతప్పి లోయలో పడిపోయిందని పోలీసులు తెలిపారు. డ్రైవర్ వాహనం నడుపుతుండగా కంట్రోల్ తప్పడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: కాల్ గర్ల్స్, రేప్ కేసు, డ్రగ్స్ బానిసలే టార్గెట్.. అందినంత దోచేస్తున్న ఫేక్ పోలీస్!