ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నైనితాల్ అనే ప్రాంతంలో ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించే క్రమంలో ఓ పికప్ వ్యాన్ అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో ఈ దుర్ఘటనలో 8 మంది మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పతలోట్ నుంచి అంజద్ వైపు వెళ్తుండగా.. ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనాస్థలంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందడం కలకలం రేపింది.
Also read: ప్రశాంతంగా ముగిసిన ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ పోలింగ్!
అయితే మృతులందరూ కాడా స్థానికులేనని తెలుస్తోంది. అందులో భార్య, భర్తతో పాటు వాళ్ల కుమారుడు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరో ముగ్గురికి గాయాలు కాగా.. వారిని ఓఖల్‌కాండా కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. ఈ ఘటనపై ఉత్తరఖాండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. అలాగే గాయాలపాలైనవారికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Also Read: అదుపు తప్పిన చంద్రయాన్ -3..భూ వాతావరణంలోకి రాకెట్ భాగం..!!