Egg Prices : వామ్మో గుడ్డు.. కొండెక్కి కూర్చున్న ధరలు!

రాష్ట్రంలో కోడిగుడ్డు ధరలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. గత నెలలో ఒక గుడ్డు ధర రూ.5.50 ఉండగా లాస్ట్ వీక్ రూ.6కు చేరింది. అయితే ఈ వారం మరింత చలి పెరగడం, కార్తిక మాసం ముగియడంతో ఒక్కసారిగా రూ. 8కి చేరుకుంది. ఒక ట్రే ఎగ్స్ రూ.180 నుంచి రూ.200 పలుకుతోంది.

Egg Prices : వామ్మో గుడ్డు.. కొండెక్కి కూర్చున్న ధరలు!
New Update

Egg Prices Hike : కోడిగుడ్డు ధర(Egg Prices) మరోసారి కొండెక్కి కూర్చుంది. ఇప్పటికే ప్పులు, బియ్యం, కూరగాయలు తదితర ఆహార పదార్థాల ధరలు పెరగడంతో సామాన్యులు ఏమీ తినాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. దీంతోపాటు కార్తిక మాసం ముగియడంతో చికెన్, గుడ్డు ధరలు కూడా అమాంతం పెరిగాయి. గతవారం రూ.200 ఉన్న చికెన్(Chicken) ఇప్పుడు ఏకంగా రూ. 250 చేరుకోగా.. ఇప్పుడు పెరిగిన ఎగ్ ధరలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

ఈ మేరకు గత నెలలో ఒక గుడ్డు ధర రూ.5.50 ఉండగా లాస్ట్ వీక్ రూ.6కు చేరింది. అయితే ఈ వారం మరింత చలి పెరగడంతోపాటు కార్తిక మాసం(Karthika Masam) ముగియడంతో రూ.7- 8కి విక్రయిస్తున్నారు. ఒక వారం రోజుల్లోనే డజను గుడ్ల ధర రూ.72 నుంచి రూ.84కు చేరగా.. హోల్‌సేల్‌లో గుడ్డు ధర రూ.5.76 ఉండగా, రిటైల్‌లో రూ.7కు అమ్ముతున్నారు. కొన్ని వీధుల్లో రూ.7.50, రూ.8కూ విక్రయిస్తున్నారు. ఒక ట్రే ఎగ్స్ రేట్ రూ.180 నుంచి రూ.200 పలుకుతుండగా.. రిటైల్‌ మార్కెట్‌లో రూ.7 నుంచి రూ.8కి అమ్ముతున్నారు.

అయితే గతంలో కరోనా కారణంగా కోడిగుడ్ల వాడకం అధికంగా పెరిగిన సంగతి తెలిసిందే. కాగా మరోసారి రాష్ట్రంలో కరోనా(Corona) వ్యాప్తి చెందుతుండటంతో గుడ్లకు డిమాండ్ పెరిగింది. దీంతో డిసెంబర్ 28న రూ. 5.90 ఉన్న గుడ్డు జనవరి 2 వరకూ రూ.7కు చేరింది. అలాగే పౌల్ట్రీఫామ్ లో రూ. 5.90కి లభిస్తుందని, దీంతో గిట్టుబాటుకాక తాము రూ.7 అమ్మాల్సివస్తుందని వ్యాపారులు చెబుతున్నారు. అలాగే ఈ ధరలు రెట్టింపు కావడంతో ప్రభుత్వ పాఠశాలల్లో వారానికి మూడుసార్లు ఇవ్వాల్సిన గుడ్లు.. ఒకేసారి ఇస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి : హాస్యబ్రహ్మకు అరుదైన గౌరవం.. పురుష్కారంతోపాటు ఆ కంకణ ప్రదానం

ఇక చలి(Winter) తీవ్రతపెరగడంతో కోళ్లు అధికశాతం చనిపోతున్నాయని, దీంతో గుడ్ల ఉత్పత్తి తగ్గిందని పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు. గత 20 రోజులుగా చలి తీవ్రత పెరిగింది. కోళ్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడి గుడ్ల ఉత్పత్తి బాగా తగ్గిందంటున్నారు. అలాగే కోళ్ల దాణా ధరలు కూడా పెరిగాయని క్వింటాలు సోయాచెక దాణా ధర ఏడాది క్రితం రూ.5 వేలు ఉండగా, ప్రస్తుతం రూ.7,200, మొకజొన్న క్వింటాలుకు రూ.1,800 నుంచి రూ.2 వేలకు పెరిగిందని వాపోతున్నారు. వాహనదారులు రవాణా చార్జీలు 15 శాతం పెంచడం గుడ్ల ధర పెరగడానికి కారణమని పౌల్ట్రీవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో 1,100 కోళ్ల ఫారాలు ఉండగా.. గుడ్ల ఉత్పత్తిలో దేశంలో తెలంగాణది మూడో స్థానం. రాష్ట్రంలో ఏటా 17.67 బిలియన్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. అయినప్పటికీ ఈ నెలలతో ఉత్పత్తి తగ్గడంతో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ముంబై తదితర ప్రాంతాలనుంచి గుడ్లను ఎగుమతి చేస్తున్నట్లు తెలిపారు.

#telangana #chicken #huge-increase #egg-prices #karthika-masam
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe