Scientists Warning : ఒకప్పుడు పిల్లలు అంటే స్కూల్ నుంచి రాగానే బయట ఆటలు ఆడుకునేవారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. మొత్తం స్మార్ట్‌ఫోన్‌లోనే గేమ్స్ ఆడటం, వీడియోలు చూడటం లాంటివి చేస్తున్నారు. ఈమధ్య చాలామంది పిల్లలు ఫోన్ చూపించందే అన్నం కూడా తినడం లేదు. ఇక చేసేదేం లేక వాళ్ల పేరెంట్స్ అలా ఫోన్‌లో వీడియోలు చూపిస్తూనే అన్నం తినిపిస్తున్నారు. అయితే పిల్లల చేతికి స్మార్ట్‌ఫోన్లు(Smartphones) ఇవ్వడంపై వైద్య పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది పిల్లల(Students) మానసిక ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపుతుందని దక్షిణ కొరియాకు చెందిన హన్యాంగ్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ జరిపిన అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా ఒకరోజులో నాలుగు గంటల కన్నా ఎక్కువసేపు స్మార్ట్‌ఫోన్లు వాడితే యుక్తవయసున్న పిల్లల్లో తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరించింది.
Also Read: రాష్ట్రంలో పెరుగుతోన్న చలి.. వాతావరణ శాఖ కీలక ప్రకటన
ప్రస్తుతం ప్రతిఒక్కరి చేతికి స్మార్ట్‌ఫోన్లు రావడంతో.. వీటి వాడకం పిల్లల్లో పెరిగిపోయింది. ఇది మానసిక జబ్బులతో పాటు.. నిద్ర, కళ్లు, ఎముకలకు అంటుకునే కండరాల సమస్యకు దారితీస్తున్నట్లు పరిశోధకులు భావిస్తున్నారు. వీటి మధ్య సంబంధాన్ని లోతుగా తెలుసుకునేందుకు మరింత దృష్టి సారించారు. రోజుకు నాలుగు గంటల కన్నా ఎక్కువసేపు వాడేవారిలో.. ఒత్తిడి, ఆత్మహత్య ఆలోచనలు పెరుగుతున్నాయని.. అలాగే దురాలవాట్లకు కూడా అలవాటు పడుతుట్లు గుర్తించారు. అందుకే పిల్లలకు ఎక్కువసేపు స్మార్ట్‌ఫోన్లలో గడపకూడదని హెచ్చరిస్తున్నారు.
Also Read: చలికాలంలో ఈ సమస్యలా..నిర్లక్ష్యం చేయకండి