CM Kejriwal And MLC Kavitha Interrogation: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అనూహ్యపరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న కేజ్రీవాల్ అరెస్ట్‌తో పరిస్థితి మరింత హాట్‌గా తయారయింది. ఒక వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంకా ఈడీ కస్టడీలోనే ఉంది. ఇప్పుడు కేజ్రీవాల్‌ను కూడా అడీ అధికారులు అరెస్ట్ చేశారు. మరికాసేపట్లో ఈయనను రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court) తరలించనున్నారు. ఈరోజు ఉదయం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కోర్టులో ప్రవేశపెట్టాక కవితలానే..కేజ్రీవాల్‌ను కూడా ఈడీ (ED) పదిరోజు కస్టడీకోరనుంది. ఒకవేళ కోర్టు కనుక ఆయనను కస్టడీకి ఇస్తే..కవితను, కేజ్రీవాల్‌ను ఇద్దరినీ కలిసి విచారించే అవకాశం ఉందని చెబుతున్నారు.
మరోవైపు మొత్తం ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) నిదింతుల జాబితాలో చేర్చనుంది ఈడీ. ఇదే కనుక జరిగితే దేశంలో ఒక పార్టీ మొత్తం ఒక కేసులో నిందితులుగా చేర్చడం ఇదే మొదటిసారి అవుతోంది. ఇక కేజ్రీవాల్ అరెస్ట్ మీద ఆమ్ ఆద్మీ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.
మరోవైపు కేజ్రవాల్ అరెస్ట్‌తో ఢిల్లీ గోలగోలగా ఉంది. నిరసనలతో హోరెత్తుతోంది. దీంతో కేంద్ర బలగాలను రంగంగలోకి దించారు ఢిల్లీ పోలీసులు. ఇక కేజ్రీవాల్‌కు ఇండియా కూటమి అండగా ఉంటుందని రాహుల్ గాంధీ ప్రకటించారు. దాంతో పాటూ ఆయన కేజ్రీవాల్ కుటుంబసభ్యులను మరికాసేపట్లో కలిసి పరామర్శించనున్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఆయన కుటుంబ సభ్యులను హౌస్ అరెస్ట్ చేశారు.
Also Read:Kavitha: కవితకు షాక్.. బెయిల్ నిరాకరణ!