ED Notices to Delhi CM Arvind Kejriwal: లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఈడీ ఉచ్చు బిగిస్తోంది. లిక్కర్ స్కాం కేసులో ఈడీకి కేజ్రీవాల్ కు మధ్య పంచాయతీ ఇంకా తెగడం లేదు. లిక్కర్ స్కాం కేసులో విచారణకు రావాలని పలుమార్లు ఈడీ కేజ్రీవాల్ కు నోటీసులు పంపిన.. ససేమిరా అంటూ విచారణకు హాజరు కాకుండా మొండిపట్టు పట్టుకున్నారు. బీజేపీకి ఈడీ ఓ అస్త్రంలా మారిందని.. ప్రభుత్వ సంస్థ మోడీ చేతుల్లో బానిస అయిందంటూ ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.
ALSO READ: కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి.. హరీష్ రావు డిమాండ్
8వ సారి.. మరి వస్తారా?
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో విచారణకు హాజరు కావాలని అర్వింద్ కేజ్రీవాల్ కు ఇప్పటికి ఏడు సార్లు నోటీసులు పంపింది ఈడీ. తమ నోటీసులను పక్కకు పెట్టి విచారణకు హాజరు కాలేదు కేజ్రీవాల్. తాజాగా ఈ కేసులో మరోసారి నోటీసులు పంపింది ఈడీ. మార్చి 4వ తేదీన విచారణకు ఢిల్లీలోని తమ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొంది. సీఎం కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు పంపడం ఇది 8వ సారి. అయితే.. ఈసారైనా సీఎం కేజ్రీవాల్ ఈడీ ఇచ్చిన నోటీసులకు స్పందించి విచారణకు హాజరవుతారా? లేదా? అనే చర్చ దేశ రాజకీయాల్లో మొదలైంది.
కేజ్రీవాల్ తో కవితకు కూడా..
ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam) కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha) కు మరో బిగ్ షాక్ తగలనుంది. ఇటీవల సీబీఐ(CBI) ఇచ్చిన నోటీసుల ప్రకారం కవిత సోమవారం సీబీఐ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ ఆమె విచారణకు రాలేనంటూ ట్విస్ట్ ఇచ్చారు. దీంతో న్యాయవిచారణకు దిగిన సీబీఐ అధికారులు.. లీగల్ అడ్వైస్(Legal Advice) తీసుకొని తదుపరి కార్యాచరణకు దిగాలని భావిస్తున్నారు. అయితే ఈ ఎపిసోడ్ తో రాజకీయంగా ఎన్నో అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కవితను ఈడీ విచారణ పేరుతో హడావుడి చేస్తే.. మరో రెండు నెలల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్న తరుణంలో ఇప్పుడు సీబీఐ నోటీసులతో హడావుడి చేయడం చర్చనీయాంశంగా మారింది.