MLC Kavitha: కవిత 16 ఫోన్లు సీజ్.. కేసీఆర్ అత్యవసర భేటీ! ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ అధికారుల తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్‌తో భేటీ అయ్యారు. ఒకవేళ కవిత అరెస్ట్ అయితే అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. By V.J Reddy 15 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి MLC Kavitha: లిక్కర్ స్కాం కేసులో భాగంగా ఎమ్మెల్యే కవిత ఇంట్లో ఐటీ శాఖ అధికారులతో కలిసి ఈడీ అధికారులు సోదాలు చేస్తున్న సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. దాదాపు మూడు గంటల నుంచి అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. విచారణలో భాగంగా ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన 16 సెల్ ఫోన్లకు అధికారులు సీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసు కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈరోజు రాత్రి వరకు ఈడీ సోదాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఆమె ఇంటికి బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ న్యాయవాదులు చేరుకోగా.. అధికారులు వారిని ఇంట్లోకి అనుమతించలేదు. ALSO READ: బీఆర్ఎస్‌కు మరో షాక్.. కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే, మాజీ మంత్రి! కేసీఆర్ కీలక భేటీ.. కవిత ఇంట్లో ఈడీ రైడ్లు జరగడంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్, ఎంపీ సంతోష్ రావు, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డితో సమావేశం అయ్యారు. కవితపై జరుగుతున్న ఈడీ రైడ్లపై వారు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈడీ అధికారులు లిక్కర్ స్కాం కేసులో కవితను అరెస్ట్ చేస్తే అనుసరించాల్సిన వ్యూహాలపై వారు చర్చిస్తున్నట్లు సమాచారం. ఓట్ల కోసమేనా?.. లోక్ సభ ఎన్నికల వేళ కవిత పై ఈడీ రైడ్లు జరగడం బీజేపీ చేస్తున్న స్టంట్ అని సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటి కాదు అని చెప్పేందుకు కవితను అరెస్ట్ చేసి లోక్ సభ ఎన్నికల్లో ప్రజల నుంచి ఓట్లు దండుకుందామని బీజేపీ పన్నిన వ్యూహం అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ బీజేపీ రెండు వేరు వేరు కాదు.. రెండు ఒకటే అందుకే కవితను అరెస్ట్ చేయడం లేదని కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. మరి కవితను ఈడీ అరెస్ట్ చేస్తుందా? లేదా? అనే ఉత్కంఠ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది. #ktr #kcr #mlc-kavitha #harish-rao #kavitha-arrest మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి