BRS : ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) కు ఈడీ మరో షాక్ ఇచ్చింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) తాజాగా మరో ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. కవితను నిందితురాలిగా ఛార్జిషీట్‌లో పేర్కొంది. లిక్కర్ కేసు(Liquor Case) లో కవిత కీలక సూత్రధారి, పాత్రధారి అని కోర్టుకు ఈడీ తెలిపింది. కవితతో పాటు మరో నలుగురు నిందితుల పాత్రపై ఛార్జీషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, విచారణలో భాగంగా సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేస్తున్నట్లు ఈడీ కోర్టుకు తెలిపింది. కాగా కవిత, ఛన్‌ప్రీత్ సింగ్, దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అర్వింద్ సింగ్‌ల పాత్రపై ఈడీ సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసింది.
Also Read : లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పాలి… సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు