Byjus : బైజూస్ కు భారీ షాక్‌ ఇచ్చిన ఈడీ..ఆ 9 వేల కోట్ల ఆస్తులకు నోటీసులు జారీ!

Byju's : మూతబడ్డ బైజూస్ ఆఫీసులు.. ఇంటి నుంచే ఉద్యోగులకు పని
New Update

ములిగే నక్క పై తాటి కాయ పడిందని..అసలే పీకల్లోతూ కష్టాల్లో కూరుకుపోయిన విద్యా సేవల సంస్థ బైజూస్‌ కు మరో భారీ షాక్‌ తగిలింది. విదేశీ నిధుల చట్టాలను అతిక్రమించినందుకు గానూ రూ. 9 వేల కోట్లను చెల్లించాల్సిందే అని ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే అధికారుల నుంచి ఎలాంటి కమ్యూనికేషన్‌ తమకు అందలేదని కంపెనీ ఎక్స్‌ లో చెప్పింది.

2011 నుంచి బైజూస్‌ 2023 మధ్య కాలంలో రూ.28 వేల కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పొందిందని ఈడీ వాదన. అలాగే విదేశీ నిధులకు సంబంధించిన చట్టాలను ఉల్లంఘిస్తూ 9 వేల 754 కోట్లను ఓవర్సీస్‌ డైరెక్ట్‌ పేరుతో పంపించారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

మీడియాలో ఈడీ నోటీసుల గురించి వస్తున్న వార్తల గురించి బైజూస్‌ తన ఎక్స్‌ ఖాతా ద్వారా స్పందించింది. కేంద్ర ప్రభుత్వ నుంచి ఎలాంటి కమ్యూనికేషన్‌ అందుకోలేదని వివరించింది. మేము ఫెమా ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లుగా వస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నామని తెలిపింది. బైజూస్‌ మాతృ సంస్థ థింక్‌ అండ్ లెర్న్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఇంజనీర్లు, ఉపాధ్యాయులైన బైజు రవీంద్రన్‌ ఆయన భార్య దివ్య గోకుల్‌ నాథ్‌ లు 2011 లో స్థాపించారు.

సంస్థ ప్రారంభించిన కొత్తలో వారు పోటీ పరీక్షల కోసం ఆన్‌ లైన్‌ లెర్నింగ్‌ ప్రోగ్రామ్‌ లను అందించారు. ఇది సక్సెస్‌ సాధించడంతో 2015లో బైజూస్‌ లెర్నింగ్‌ యాప్‌ ను ప్రారంభించారు. దీంతో కొద్ది కాలంలోనే ఆ యాప్‌ కు విశేష ఆదరణ రావడంతో రెండేళ్ల తర్వాత పిల్లల కోసం మ్యాథ్స్‌ యాప్‌, వారి డెవలప్మెంట్‌ ను పరీక్షించేందుకు తల్లిదండ్రుల కోసం మరో యాప్‌ ను ప్రారంభించారు.

అయితే గత కొంత కాలం నుంచి బైజూస్‌ తన సంస్థ ఉద్యోగులను తొలగిస్తుంది. గతేడాది అక్టోబర్‌ లో 50 వేలుగా ఉన్న సంస్థ ఉద్యోగులు క్రమంగా తగ్గుతూ రాగా వారి సంఖ్య దాదాపు 31 నుంచి 33 వేలకు వచ్చింది. కానీ సంస్థ నుంచి తీసేసిన తరువాత మాజీ ఉద్యోగులకు వారి జీతాలు ఇవ్వడానికి కూడా సంస్థ చాలా ఇబ్బందులు పడుతోంది.

తమకు ఇవ్వాల్సిన నగదు విషయంలో కూడా సంస్థ విఫలమైందని కొందరు మాజీ ఉద్యోగులు ఆరోపించారు. 45 రోజుల్లో FNF చెల్లించాలి. కానీ మూడు నెలలు గడిచినా ఉద్యోగులకు సెటిల్మెంట్ చేయడంలో సరిగ్గా వ్యవహరించలేదని మాజీ ఉద్యోగి ఒకరు సోషల్ మీడియాలో వివరాలను షేర్ చేయడంతో వైరల్ అయింది.

Also read: నాన్ వెజ్‌ ప్రియులకు గుడ్ న్యూస్‌..భారీగా తగ్గిన చికెన్‌ ధరలు!

#ed #national #notice #byjus
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe