Liquor Scam : కేజ్రివాల్ కు షాక్ ఇచ్చిన ఈడీ.. నేడే విచారణ!

ఢిల్లీ సీఎం కేజ్రివాల్ కు ఈడీ షాక్ ఇచ్చింది. లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే పలు సార్లు విచారణకు డుమ్మా కొట్టిన కేజ్రివాల్ ను నేడు విచారణకు హాజరుకావాల్సిందిగా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈడీ జారీ చేసిన సమన్లపై స్టే ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టులోని సెషన్స్ కోర్టు నిరాకరించింది.

New Update
Liquor Scam: ఆమ్‌ ఆద్మీ పార్టీని కుదిపేస్తోన్న ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌..!

Delhi : ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్(Delhi CM Kejriwal) కు ఈడీ(ED) షాక్ ఇచ్చింది. లిక్కర్ స్కాం(Liquor Scam) లో ఇప్పటికే పలు సార్లు విచారణకు డుమ్మా కొట్టిన కేజ్రివాల్(Kejriwal) ను నేడు విచారణకు హాజరుకావాల్సిందిగా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసులో ఈడీ సమన్లను వరుసపెట్టి దాటవేస్తున్న ఆయనను శనివారం తమ ఎదుట హాజరుకావాలని ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌ కోర్టు ఆదేశించింది. కేజ్రీవాల్‌కు ఈడీ జారీ చేసిన సమన్లపై స్టే ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టులోని సెషన్స్ కోర్టు తిరస్కరించింది.

ఇది కూడా చదవండి: Kavitha: ఈడీ అరెస్ట్‌పై సుప్రీంకోర్టుకు కవిత.. ఇవాళ ఏం జరగబోతుందోనన్న ఉత్కంఠ!

ఈ మేరకు మనిలాండరింగ్ కేసు(Money Laundering Case) లో ఈడీ విచారణ నుంచి మినహాయింపును పొందాలని భావిస్తే శనివారం రోజు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌ ఎదుటే హాజరుకావాలని తెలిపింది. ఎనిమిది సార్లు ఈడీ సమన్లు జారీ చేసినా సీఎం కేజ్రీవాల్ డుమ్మా కొట్టిన నేపథ్యంలో.. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఈడీ రెండు ఫిర్యాదులు దాఖలు చేయగా.. కేజ్రీవాల్‌ను కోర్టుకు పిలిచి న్యాయవిచారణ జరపాలని కోరింది. మార్చి 16న తప్పనిసరిగా విచారణకు హాజరుకావాల్సిందిగా ఆప్ చీఫ్‌ను కోర్టు ఇటీవల ఆదేశించిన విషయం తెలసిందే. కాగా ఈ ఆర్డర్‌ను సవాల్ చేస్తూ సెషన్స్ కోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్‌కు చుక్కెదురైంది.

Advertisment
తాజా కథనాలు