ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్ మీద సస్పెన్షన్ ఎత్తివేత

తెలంగాణ ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్ మీద సస్పెన్షన్ ఎత్తి వేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఉద్దేశపూర్వకంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించలేదని అంజనీ కుమార్ చేసిన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.

ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్ మీద సస్పెన్షన్ ఎత్తివేత
New Update

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో డీజీపీ గా ఉన్న అంజనీ కుమార్ ను ఈసీ సస్పెండ్ చేసింది. ఎన్నికల ఫలితాల రోజు ఈసీ నింబధలనకు వ్యతిరేకంగా ఆయన రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ కారణంగానే అంజనీ కుమార్ ను ఈసీ సస్పెండ్ చేసింది. అయితే ఇప్పుడు దాన్ని ఎత్తేసింది. తాను ఉద్దేశపూర్తకంగా ఎననికల కోడ్ ఉల్లంఘించలేదని..ఎన్నికల ఫలితాల రోజున రేవంత్ రెడ్డి పిలిస్తేనే వెళ్ళాలని...మరోసారి ఇలా జరగదని అంజనీ కుమార్ వివరణ ఇచ్చారు. ఈ విజ్ఞప్తిని పరిగనలోకి తీసుకున్న ఈసీ సస్పెన్షన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది.

Also read:ప్రజా దర్బార్ పేరు మార్పు..ఇకమీదట రెండు రోజులు మాత్రమే

#ec #dgp #telanagana #anjani-kumar
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe