Nagababu Video: నాగబాబుకు ఈసీ షాక్.. ఓటు వేయకముందే ఇంకు వేస్తున్నారంటూ! జనసేన నాయకుడు నాగబాబుకు ఈసీ షాక్ ఇచ్చింది. ఓట్లకోసం డబ్బులు తీసుకున్న ప్రజలకు ఓ రాజకీయ పార్టీ ఇంకు గుర్తులు పెడుతుందంటూ ఆరోపించిన వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను నమ్మవద్దని స్పష్టం చేసింది. By srinivas 12 May 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి EC Fact Check Over Nagababu Video: నటుడు, జనసేన నాయకుడు నాగబాబుకు ఈసీ షాక్ ఇచ్చింది. ఓ రాజకీయ పార్టీకి చెందిన కార్యకర్తలు డబ్బులు ఇచ్చిన గుర్తుగా ఓటర్లకు సిరా ఇంకు వేస్తున్నారనే ఆరోపణలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు నాగబాబు వీడియోపై స్పందిస్తూ.. నాగబాబు ఆరోపణలు అవాస్తమని తేల్చి చెప్పింది. అంతేకాదు ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించిన ఆయనపై చర్యలు తీసుకోవాలని పిఠాపురం (Pithapuram) అసెంబ్లీ నియోజకవర్గంలో జాయింట్ కలెక్టర్, రిటర్నింగ్ అధికారికి ఆదేశాలు జారీ చేసింది. ⚠️ MISINFORMATION ALERT! ⚠️ 🛑 This morning false information in the form of video message from a leader of the Jana Sena Party has been spread in WhatsApp claiming that functionaries from another political party were giving out money and marking voters with indelible ink to… pic.twitter.com/O2dH0dh5OS — Chief Electoral Officer, Andhra Pradesh (@CEOAndhra) May 12, 2024 సిరా వేస్తే తీవ్రమైన పరిణామాలుంటాయి.. ఈ మేరకు భారత ఎన్నికల సంఘం (Election Commission) నియమించిన అధికారులకు మాత్రమే చెరగని సిరా ఉపయోగించే అధికారం ఉందని, ఎవరైనా వేరే సిరాను ఉపయోగించాలని ప్రయత్నిస్తే పట్టుబడ్డారని ఈసీ స్పష్టం చేసింది. ఒకవేళ ఎవరైన ఓటర్లకు సిరా వేస్తే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొంటారని హెచ్చరించింది. వాట్సాప్‌లో వైరల్ అవుతున్న వీడియోను నమ్మవద్దని, ఇలాంటి తప్పుదారి పట్టించే సమాచారాన్ని పంచుకునే ముందు ఎల్లప్పుడూ వాస్తవాన్ని గుర్తించాలని చెప్పింది. ఓటర్ మహాశయులార బీ అలర్ట్ మీ ఓటు దోపిడీ కాబోతుంది సిరా పూసి ఓటు వెయ్యకుండానే మీ ఓటుని కాజేసే వైసిపి కుట్ర ని తరిమికొట్టండి....@ECISVEEP#beawareofbrastachars #castyourvote pic.twitter.com/vRdyD35ZSt — Naga Babu Konidela (@NagaBabuOffl) May 11, 2024 ఇంతకు ఏం జరిగింది.. ఏపీలో ఓ రాజకీయ పార్టీ నేతలు మరో దారుణానికి శ్రీకారం చుట్టారంటూ నాగబాబు వీడియో విడుదల చేశారు. ఓ పార్టీల వాళ్లు ఓటుకు నోటు ఇస్తున్నారని, ప్రతి ఇంటికీ డబ్బులు అందచేయడంతో పాటు.. డబ్బులు ఇచ్చిన ప్రజల వేళ్లపై ఓటు వేసినట్లుగా సిరా మార్కు వేస్తున్నారని ఆరోపించారు. వాళ్లు 13వ తేదీన ఓటు వేసేందుకు అనర్హులుగా మారుస్తున్నారన్నారు. ప్రతి ఓటరు డబ్బులు తీసుకుని ఇంట్లోనే ఉండేలా భయపెడుతున్నారన్నారు. పిఠాపురం వంటి నియోజకవర్గంలో భారీగా డబ్బులు వెదజల్లుతున్నారని ఆరోపించారు. డబ్బులిచ్చి వేళ్ల మీద సిరా చుక్కలు వేసేలా పన్నాగం చేస్తున్నారన్నారు. ఓటర్లు పోలింగ్ బూత్‌కు వెళ్లినా సిరా గుర్తు చూసి అనర్హుడిగా ప్రకటించే అవకాశం ఉందన్నారు. ఈ అంశాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. ప్రజాస్వామ్యం కల్పించిన హక్కును కాలరాసేందుకు అమాయక ప్రజలను మళ్లీ ఆ పార్టీ మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. #ap-elections-2024 #ec #janasena #nagababu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి