Election Commission : పోలింగ్‌ సమయాన్ని పెంచిన ఎన్నికల కమిషన్‌..ఎక్కడ..ఎందుకంటే!

దేశ వ్యాప్తంగా రెండో విడత ఎన్నికలు శుక్రవారం జరగనున్నాయి. ఈ క్రమంలో కేంద్ర వాతావరణ శాఖ వచ్చే వారం పాటు దేశ వ్యాప్తంగా తీవ్రమైన వడగాల్పులు ఉంటాయని హెచ్చరికలు ఇచ్చింది.దీంతో వడగాల్పులు ఎక్కువగా వీచే బీహార్‌ వంటి రాష్ట్రాల్లో పోలింగ్‌ సమయాన్ని పెంచాలని ఈసీ నిర్ణయం తీసుకుంది.

New Update
Election Commission : పోలింగ్‌ సమయాన్ని పెంచిన ఎన్నికల కమిషన్‌..ఎక్కడ..ఎందుకంటే!

Elections 2024 : దేశ వ్యాప్తంగా ఎన్నికల జోరు కొనసాగుతుంది. ఈ సారి ఎన్నికలు(Elections) ఏడు విడతల్లో జరుగుతాయని ముందుగానే తెలిసిన విషయమే. తొలి విడత ఎన్నికలు ఏప్రిల్‌ 19 న జరిగిన విషయం తెలిసిందే. రెండో విడత ఎన్నికలు శుక్రవారం జరగనున్నాయి. ఈ క్రమంలో కేంద్ర వాతావరణ శాఖ ఎన్నికల సంఘానికి(Election Commission) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

వచ్చే వారం పాటు దేశ వ్యాప్తంగా తీవ్రమైన వడగాల్పులు(Hail) ఉంటాయని హెచ్చరికలు ఇచ్చింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. మరోవైపు వాడగాల్పుల కారణంగా పోలింగ్ శాతం పడిపోతుందని నిపుణులు కూడా ముందుగానే అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐఎండీ చీఫ్‌తో ఎన్నికల సంఘం చర్చలు జరిపింది. వడగాల్పులు ఎక్కువగా వీచే రాష్ట్రాల్లో బీహార్ కూడా ఉంది. దీంతో ఆ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ సమయాన్ని ఎలక్షన్‌ కమిషన్‌ పొడిగించింది.

రెండు గంటల పాటు అదనంగా సమయం పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. వడగాల్పుల హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. బీహార్‌లోని నాలుగు పార్లమెంటరీ నియోజకవర్గాల్లోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్‌లలో ఎన్నికల సమయాన్ని రెండు గంటల పాటు పొడిగించింది. నోటిఫికేషన్ ప్రకారం.. బంకా, మాధేపురా, ఖగారియా, ముంగేర్ లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్‌ సమయం ఉదయం 7 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది.

అయితే వేడిగాలుల దృష్ట్యా పోలింగ్‌ శాతాన్ని పెంచేలా సమయాన్ని బీహార్ ప్రధాన ఎన్నికల అధికారి కేంద్రం ఎన్నికల సంఘాన్ని కోరారు. ఆ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం ఆ నాలుగు లోక్‌సభ నియోజక వర్గాల్లో పోలింగ్‌ సమయాన్ని మార్చాలని నిర్ణయించింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమయాన్ని.. రెండు గంటల పాటు పొడిగించింది. అంటే సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరగనుంది.

Also read: అనారోగ్యంతో బీజేపీ ఎంపీ కన్నుమూత!

Advertisment
Advertisment
తాజా కథనాలు