Vetiver Benefits: శరీరానికి ఆహారం ఎంత అవసరమో నీరు కూడా అంతే అవసరం. ముఖ్యంగా వేసవిలో డీహైడ్రేషన్ నుంచి తప్పించుకునేందుకు ఎన్నో డ్రింక్స్ తాగుతూ ఉంటాం. కొన్ని ప్రత్యేకమైన పదార్థాలతో నీటిని మరిగించి వేసవిలో తాగడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాంటి వాటిలో వట్టివేరు ఒకటి. ఆయుర్వేదం ప్రకారం వట్టివేరులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది వేడిని తగ్గించడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. వట్టివేరుతో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
వట్టివేరు ఉపయోగాలు:
- వట్టివేరు శరీరం, కడుపు రెండింటినీ చల్లబరుస్తుంది. వేసవిలో చెమటకాయలు దరిచేరనివ్వదు. మొటిమలకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా చెమట వాసన పోవడానికి, ఎక్కువ చెమట పట్టకుండా ఉండేందుకు సహాయపడుతుంది. వట్టివేరు తురుము శరీరానికి రాసుకుంటే వేడి కురుపుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
నిద్ర:
- వేసవిలో తక్కువ నిద్రపోవడం సహజం. వట్టివేరుతో చేసిన డ్రింక్ తాగితే నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఒత్తిడి వంటి సమస్యలు దూరం అవుతాయి. కోపం, అశాంతి, రక్తపోటు మొదలైన వాటిని నయం చేస్తుంది. మెదడు, మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది.
కడుపు:
- కడపు ఆరోగ్యానికి వట్టివేరు నీరు చాలా మంచిది. వాంతులు, విరేచనాలు వంటి అనేక వ్యాధులకు ఇది మేలు చేస్తుంది. ఇది పొట్టను చల్లబరుస్తుంది కాబట్టి ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు, మలబద్ధకం ఉండవు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కాలేయ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. వేసవిలో వచ్చే జ్వరం, తలనొప్పి వంటి అనేక సమస్యలకు ఇది మంచి మందు అని నిపుణులు అంటున్నారు.
బీపీ నియంత్రణకు:
- బీపీ అదుపులో ఉండేందుకు వట్టివేరు నీరు చాలా మంచిది. దీన్ని నిర్దిష్ట పద్ధతిలో ఉపయోగించడం ప్రయోజనకరంగా ఉంటుంది.
మూత్ర సంబంధ వ్యాధులు:
- వేసవిలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ. వట్టివేరు జ్యూస్ 10 రోజులు తాగితే మూత్ర సంబంధిత వ్యాధులు నయమవుతాయని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: ప్రొగతాగడం జుట్టుకు హానికరం..తెల్లగా మారే అవకాశం
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.