Processed Food : ప్రాసెస్‌ చేసిన ఆహారంతో చర్మానికి కూడా ప్రమాదమా..?

వేయించిన ఆహారాలలో ఎక్కువ ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి చర్మం నుంచి తేమ, చర్మం పొడిబారినట్లు, చర్మాన్ని నిర్జీవంగా మారుస్తాయని నిపుణులు అంటున్నారు. ప్రాసెస్ చేసిన ఆహారలోని నూనె, ఉప్పు, చక్కెర ఉండటంతో మొటిమలు, ముఖంపై ముడతలకు కారణం అవుతుందని చెబుతున్నారు.

New Update
Processed Food : ప్రాసెస్‌ చేసిన ఆహారంతో చర్మానికి కూడా ప్రమాదమా..?

Processed Food Problems : వేయించిన, ప్రాసెస్ చేసిన ఆహారం(Processed Food) చర్మంపై చెడు ప్రభావాన్ని(Skin Problems) చూపుతుంది. ఇందులో ఎక్కువ నూనె, ఉప్పు, చక్కెర ఉండటంతో మొటిమలు, ముఖంపై ముడతలకు కారణం అవుతుంది. అంతేకాకుండా చర్మాన్ని నిర్జీవంగా మారుస్తాయి. ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకోవటం వలన ఏం అవుతుందో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ట్రాన్స్ ఫ్యాట్స్:

  • వేయించిన ఆహారాలలో ఎక్కువ ట్రాన్స్ ఫ్యాట్స్(Trans Fats) ఉంటాయి. ఇవి చర్మం నుంచి తేమను తొలగిస్తాయి. దీని కారణంగా చర్మం పొడిబారినట్లు కనిపిస్తుంది. అంతేకాకుండా ఇందులోని కొవ్వులో చర్మాన్ని నిర్జీవంగా మారుస్తాయని నిపుణులు అంటున్నారు.

మొటిమలు, చర్మ సమస్యలు:

  • ఈ ఆహారాలలో అధిక గ్లైసెమిక్ ఇండెక్స్(Glycemic Index) ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. అంతేకాకుండా మొటిమలు, ఇతర చర్మ సమస్యలకు కారణం అవుతుంది. అందుకే చర్మం ఆరోగ్యంగా, శుభ్రంగా ఉండటానికి ప్రాసెస్‌ ఫుడ్స్‌ తక్కువగా తీసుకోవాలి. అంతేకాకుండా ఇలాంటి ఆహారం తీసుకుంటే తొందరగా వృద్ధాప్య ఛాయలు వస్తాయి. అలాగే శరీరంలో ఫ్రీ రాడికల్స్ పెరుగుతాయి. మన చర్మంలోని కొల్లాజెన్‌ను బలహీనపరుస్తుందని నిపుణులు అంటున్నారు. ముడతలు, చర్మంపై గీతలు ఏర్పడతాయని హెచ్చరిస్తున్నారు.

పోషకాల కొరత:

  • వేయించిన ఆహారాలలో పోషకాలు సమృద్ధిగా ఉండవు, చర్మానికి అవసరమైన విటమిన్లు(Vitamins), ఖనిజాల లభించవని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఎక్కువ ఉప్పు, చక్కెర తినడం వల్ల చర్మం నిర్జలీకరణం చెందుతుంది. దీని కారణంగా చర్మం పొడిగా, నిర్జీవంగా కనిపిస్తుందని అంటున్నారు. చర్మంపై ఎరుపు, వాపు కూడా వస్తుందని హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి: వేసవిలో ఇలా తోడేస్తే పెరుగు అస్సలు పుల్లగా మారదు

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు