Pizza: మీకు పిజ్జా తినే అలవాటు ఉందా?.. ఎంత ప్రమాదమో తెలుసా? పిజ్జా తినడం ఆరోగ్యానికి చాలా హానికరం. పిజ్జా ఎక్కువగా తినడం వల్ల ఊబకాయం, మధుమేహం లాంటి రోగాల బారిన పడతాం. ఇందులో సోడియం అధికంగా ఉండటం వల్ల అధిక రక్తపోటు కూడా రావొచ్చు. పిజ్జాలో చీజ్, వెన్న కొలెస్ట్రాల్‌తో పాటు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. By Vijaya Nimma 22 Mar 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Pizza: చాలా మంది పిజ్జా తినడానికి ఇష్టపడతారు. ఇది మార్కెట్‌లో అనేక రుచులలో లభిస్తుంది. అయితే పిజ్జా ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిజ్జా తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఊబకాయం, మధుమేహం సమస్యలు: పిజ్జా అనేది పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఆహారం. దీని వల్ల చాలా నష్టాలు కూడా ఉన్నాయి. పిజ్జాను ఎక్కువ కారంగా, నూనె వేసి తయారు చేస్తారు. అందుకే అందులో ఎక్కువ కేలరీలు ఉంటాయి. అంతేకాకుండా పిజ్జా తినడం వల్ల ఊబకాయం, మధుమేహం వంటి సమస్యలకు దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. పిజ్జా వల్ల కలిగే నష్టాలు: పిజ్జాలో ఎక్కువ చీజ్, వెన్న ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్‌తో పాటు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అంతే కాకుండా పిజ్జాను పిండితో తయారు చేస్తారు. ఈ పిండి జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. పేగు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇందులో సోడియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటు వంటి సమస్యలు వస్తాయని, పిజ్జాలో కెఫిన్ ఉండటం వల్ల నిద్ర సమస్యలను కలిగిస్తుందని వైద్యులు చెబుతున్నారు. వైద్యుల సలహా: పిజ్జా తినడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. దీని వల్ల అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. వీటన్నింటిని నివారించడానికి పిజ్జా వినియోగాన్ని తగ్గించాలి. పిజ్జా తినాలని అనిపిస్తే ఆరోగ్యకరమైన పదార్థాలను ఉపయోగించి ఇంట్లోనే తయారు చేసుకోవాలని సూచిస్తున్నారు. పిజ్జాకు బదులుగా ఆరోగ్యకరమైన పోషకాహారాన్ని తినడానికి ప్రయత్నించాలని, ఏదైనా అలవాటును అకస్మాత్తుగా మానేయడం చాలా కష్టం కాబట్టి కొద్దికొద్దిగా దానిని వదులుకోవడానికి ప్రయత్నించాలని చెబుతున్నారు. ఇది కూడా చదవండి: మహిళల్లో రోజురోజుకు పెరుగుతున్న డిప్రెషన్.. కారణాలు తెలుసా..? గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-benefits #best-health-tips #pizza మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి