Paneer Health Benefits: పన్నీర్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. రోజూ తింటే ఏమవుతుందో తెలుసా..?

మనం తీనే ఆహారంలో ఎన్నో రకాల వెరైటీలను పన్నీర్‌తో చేసి తింటాం. వెజిటేరియన్ ఇష్టపడేవారు ఎక్కువగా రెస్టారెంట్స్‌, హోటల్‌లో దొరికే పన్నీర్ ఐటెమ్స్‌ని టేస్ట్ చేసే వాటిల్లో ఇది కూడా ఒకటి.ఎన్నో అరోగ్య ప్రయోజనాల కోసం పన్నీర్‌ను ప్రతీరోజూ తినాలని నిపుణులు చెబుతున్నారు.

New Update
Paneer Health Benefits: పన్నీర్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. రోజూ తింటే ఏమవుతుందో తెలుసా..?

Eating paneer daily: పన్నీర్‌ తినటం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పన్నీర్‌లో క్యాల్షియం, ప్రోటీన్, విటమిన్స్ అధికంగా ఉంటాయి. ఇది శరీరాన్ని, ఎముకలను దృఢంగా ఉచుతుందే తప్ప పన్నీర్‌ను తిటం వల్ల ఎలాంటి సమస్యలు లేవు. అయితే.. ఈ పన్నీర్‌ని మాత్రం మరీ ఎక్కువగా తినకూడదని వైద్యులు చెబుతున్నారు. అయితే.. చైనాలో పుట్టుకొచ్చిన క‌రోనా అతిసూక్ష్మజీవి అయిన‌ప్పటికీ..ప్రపంచ‌దేశాల్లోనూ క‌రోనా మ‌హ‌మ్మారి టెర్రర్ సృష్టిస్తున్న విష‌యం తెలిసిందే. వ్యాక్సిన్ కూడా అందుబాటులో లేక‌పోవ‌డంతో ల‌క్షల మంది ప్రాణాల‌ను పొట్టన‌పెట్టుకుంది. అందుకే ఈ ప్రాణాంత‌క వైర‌స్ అదుపు చేసి.. రోగ‌నిరోధ‌కశ‌క్తి పెంచే ఆహారం తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. అయితే.. ఇమ్యూనిటీ పెంచే ఆహారంలో ప‌న్నీర్ కూడా ఒక‌టి. ప్రతిరోజు ప‌న్నీర్ తీసుకోవ‌డం వ‌ల్ల అందులో ఉండే పోష‌కాలు భ‌యంక‌ర వైర‌స్‌ల‌తో పోరాడి రోగ‌నిరోధ‌క వ్యవ‌స్థ పెచుతుంది. అంతేకాదు రోగ‌నిరోధ‌క శ‌క్తి పెంచ‌డ‌ంతోపాటు ప‌న్నీర్‌తో మ‌రిన్ని ఆరోగ్య ప్రయోజ‌నాలు కూడా ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం.

పన్నీర్‌ వల్ల ఉపయోగాలు

  • ప‌న్నీర్ రక్తంలోని షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేయ‌డంలో కీలక పాత్ర పోషిస్తుంది
  • మధుమేహం రాకుండా ప‌న్నీర్ అద్భుతంగా ప‌నిచేస్తుంది
  • పన్నీర్‌లో ఉండే కాల్షియం ఎముకలు, దంతాలను బలోపేతం చేస్తుంది
  • పన్నీర్‌ తింటే చాలామంది బ‌రువు పెరుగుతార‌ని అనుకుంటారు.
  • పన్నీర్‌లో ఉండే అధిక ప్రొటీన్ ఎక్కువ టైం క‌డుపు నిండిగా ఉంటుంది
  • అధిక బరువు ఉన్నవారు పన్నీర్‌తో బ‌రువును తగ్గించుకోవచ్చు
  • పన్నీరులో ఫాస్ఫేట్‌, ఫాస్ఫరస్‌లు జీర్ణక్రియను మెరుగుపరచి మలబద్ధకాన్ని పొగొడుతుంది
  • సూర్యర‌శ్మి నుంచి వ‌చ్చే విట‌మిన్-డీ ప‌న్నీర్ ద్వారా పొందొచ్చు
  • పన్నీర్ మెగ్నీషియంతో నిండి ఉంటుంది.
  • గుండె జ‌బ్బుల‌ను నివారించి.. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతోంది
  • ప్రతీరోజు మోతాదు మించికుండా ప‌న్నీర్ తీసుకుంటే వృద్ధాప్యం రాదు
    ఇది కూడా చదవండి: అల్లం వేడినీటిలో క‌లిపి తాగుతున్నారా..? జాగ్రత్తలు తెలుసుకోండి

అంతేకాకుండా.. రోజూ ఆహారంలో పన్నీర్‌ను తీసుకుంటే ఆకలి త్వరగా వేయదు. ఆహారం మితంగానే తీసుకుంటారు కాబట్టి బరువు తగ్గుతారు. పన్నీర్‌లో పోషకాలు అధికం ప్రతిరోజూ 50 గ్రాముల పన్నీరును తింటే భవిష్యత్‌లో గుండె జబ్బులు రావని వైద్యులు చెబుతున్నారు. అధిక రక్తపోటును నియంత్రించి గుండెపోటు రాకుండా చేస్తుంది. పన్నీర్‌లోని ఫొలేట్ ఎర్ర రక్తకణాలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. పనీర్‌లో ఉండే ప్రొటీన్‌లు, క్యాలరీల కారణంగా కొవ్వును వేగంగా కరిగిస్తుంది. కాబట్టి ఇది బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించడంలో ఎక్కువగా సహాయపడుతుంది. అలాగే.. పనీర్‌తో చేసిన వంటకాలు బరువు తగ్గడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. రోటీ, అన్నంలో పనీర్ తింటే బరువు తగ్గడానికి పనీర్ బుర్జి ఆరోగ్యకరమైన ఆహారం. థందూరి రోటీ, రోటీలు, చపాతీ, బటర్ నాన్, జింజర్ రోటీ వీటితో పాటు తింటే ఆ రుచే వేరుగా ఉంటుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు