Niranjan Phal : నిరంజన్ ఫల్(Niranjan Phal).. దీన్ని చైనా పండు అని కూడా అంటారు. ఎక్కువ శాతం భారత్, బంగ్లాదేశ్(Bangladesh) లో దీన్ని పండిస్తారు. చూసేందుకు ఎర్రగా ఉంటుంది, లోపల ద్రాక్ష లాంటి విత్తనాలు ఉంటాయి. ఇది భారతదేశం(India) లోని అడవులలో పెరిగినప్పటికీ కొన్ని కారణాల వల్ల దీనిని చైనా పండు అని కూడా పిలుస్తారు. రక్తం గడ్డకట్టడం, హేమోరాయిడ్స్, జీర్ణవ్యవస్థ, పెద్దప్రేగు రుగ్మతల చికిత్సలో దీన్ని వాడుతారు. మూలశంఖ సమస్య ఉన్నవారు రాత్రి నిద్రపోయే ముందు ఈ ఒక్క నిరంజన్ పండును అరగ్లాసు నీటిలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగితే సమస్య తగ్గుతుంది.
మలబద్దకాన్ని నివారిస్తుంది:
అల్సర్ బాధితులు కూడా దీనిని తీసుకోవచ్చు. గొంతు నొప్పి(Throat Pain) తో పాటు శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుందని, గర్భాశయంలో రక్త ప్రసరణను ఈ పండు నిలిపివేస్తుందని నిపుణులు అంటున్నారు. అంతే కాకుండా యూరినరీ ఇన్ఫెక్షన్లను తొలగిస్తుందని, గ్రంధి వ్యవస్థను శుభ్రపరుస్తుందని చెబుతున్నారు. ఈ నిరంజన్ ఫల్‌లో పీచు పదార్థాలు, కాల్షియం, ఐరన్, విటమిన్లు బి1, బి2, అయోడిన్ పుష్కలంగా ఉంటాయి. ఈ పండు తినడం వల్ల మొటిమలు తగ్గిపోతాయి, అలాగే తలనొప్పి కూడా మాయం అవుతుంది. నిద్రలేమి సమస్యల నుంచి కూడా బయటపడవచ్చని చెబుతున్నారు.
పేగుల్లో ఉండే చెడు బ్యాక్టీరియా తొలగిపోతుంది:
అంతే కాకుండా.. ఛాతీ భాగంలో అసౌకర్యాన్ని తగ్గిస్తుందని, క్యాన్సర్‌ను కూడా నివారించే గుణం ఈ పండులో ఉందని వైద్యులు అంటున్నారు. సోరియాసిస్ లాంటి చర్మ వ్యాధులను(Skin Diseases) కూడా నయం చేస్తుందని నిరూపితమైంది. ఈ నిరంజన్ ఫల్ ఎక్కువగా కంబోడియా, వియత్నాం, లావోస్, థాయిలాండ్, మయన్మార్, మలేషియాలో లభిస్తుంది. దీన్ని టీ, కాఫీ, గ్రీన్ టీతో కలిపి తీసుకోవడం వల్ల పేగుల్లో ఉండే చెడు బ్యాక్టీరియా తొలగిపోతుంది. అంతేకాకుండా మన బరువు తగ్గించి, చర్మ సమస్యలను నివారిస్తుందని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: ఆందోళన, మానసిక ఒత్తిడి తగ్గించే ఐదు మార్గాలు.. మీకోసం..!!
గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఆరోగ్యకరమైన అల్పాహారం.. బ్రౌన్‌బ్రెడ్ తయారీ విధానం