Kidney: చెడు జీవనశైలి వల్ల ఎవరికైనా కిడ్నీ స్టోన్ సమస్య రావచ్చు. కొన్నిసార్లు ఇది నీటి కొరత కారణంగా కూడా జరుగుతుంది. అయితే, శరీరంలో కాల్షియం మరియు కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగినప్పుడు రాళ్లు ఏర్పడతాయి. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారాన్ని మెరుగుపరచడం అవసరం. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం తెల్లటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. ఎందుకంటే ఇవి కిడ్నీలో రాళ్లను కలగజేస్తాయని అంటున్నారు.
కిడ్నీ బాధితులు ఎందుకు పెరుగుతున్నారు?
- కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మాత్రమే ప్రజలు కిడ్నీ సమస్యలను తీవ్రంగా పరిగణిస్తారు. మూత్రంలో ప్రోటీన్ లీకేజీని గుర్తించే సమయానికి శరీరంలోని అతి ముఖ్యమైన అవయవం 60-70 శాతం దెబ్బతింటుంది. ఈ కారణంగా 15 ఏళ్లలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య రెట్టింపు అయింది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఆహారాలు పొరపాటున కూడా తినకూడదని నిపుణులు అంటున్నారు.
ఉప్పు:
- ఉప్పులో సోడియం చాలా ఎక్కువ. దీని వల్ల శరీరంలో సోడియం సమతుల్యత దెబ్బతింటుంది. ఇది బీపీని కూడా పెంచుతుంది. దీని ప్రభావం మూత్రపిండాల పనితీరుపై ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఎముకలు కూడా బలహీనపడతాయని నిపుణులు అంటున్నారు.
చక్కెర:
- ఎక్కువ చక్కెర తినడం మూత్రపిండాలపై కూడా ప్రభావాలను చూపుతుంది. రక్తంలో చక్కెర స్థాయి 180mg/dl కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మూత్రపిండాలు మూత్రంలోకి చక్కెరను విడుదల చేయడం ప్రారంభిస్తాయి. డయాబెటిక్ రోగుల కిడ్నీలు త్వరగా పాడవడానికి ఇదే కారణని నిపుణులు అంటున్నారు.
అరటిపండు:
- అరటిపండులో చాలా ఎక్కువ పొటాషియం ఉంటుంది. సోడియం తక్కువగా ఉంటుంది. దీన్ని తిన్న తర్వాత శరీరంలో పొటాషియం స్థాయి పెరుగుతుంది.ఇది శరీరానికి హానికరమని వైద్యులు అంటున్నారు.
గోధుమ రొట్టెలు:
- కిడ్నీ దెబ్బతినకుండా ఉండాలంటే గోధుమ రొట్టెలను అస్సలు తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. మూత్రపిండాల్లో రాళ్లతో బాధపడుతున్న రోగులు గోధుమ రొట్టెలకు దూరంగా ఉండాలని సలహా ఇస్తున్నారు.
ఇది కూడా చదవండి: రోజుకు ఎన్ని ఖర్జూరాలు తినాలి?.. ఎన్ని తింటే మంచిది?
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.